Fish Benefits: ఎప్పుడూ చికెన్, మటనే తింటున్నారా.. చేపలతో అసలైన ఆరోగ్యం!!
చాలా మందికి చికెన్, మటన్ అంటేనే చాలా ఇష్టం. ముఖ్యంగా కొంత మందికి చికెన్ అంటే ప్రాణం. ఆ తర్వాతే ఏ నాన్ వెజ్ ఐటెమ్ అయినా. అందులోనూ చేప తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే వాటిల్లోని ముల్లు తీయాలంటే చాలా కష్టం. కాస్త సమయం పడుతుంది. దీంతో దాన్ని పక్కకు పెట్టేస్తుంటారు. కానీ చికెన్, మటన్ కంటే చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. కనీసం వారంలో రెండు సార్లైనా చేపలను తినాలంట. ఇంకా చేపలతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో..
చాలా మందికి చికెన్, మటన్ అంటేనే చాలా ఇష్టం. ముఖ్యంగా కొంత మందికి చికెన్ అంటే ప్రాణం. ఆ తర్వాతే ఏ నాన్ వెజ్ ఐటెమ్ అయినా. అందులోనూ చేప తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే వాటిల్లోని ముల్లు తీయాలంటే చాలా కష్టం. కాస్త సమయం పడుతుంది. దీంతో దాన్ని పక్కకు పెట్టేస్తుంటారు. కానీ చికెన్, మటన్ కంటే చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. కనీసం వారంలో రెండు సార్లైనా చేపలను తినాలంట. ఇంకా చేపలతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల్లో తక్కువ కొలెస్ట్రాల్:
చికెన్, మటన్ తింటే కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. కానీ చేపలు తింటే మాత్రం కొలెస్ట్రాల్ చేరే అవకాశం ఉండదని అంటున్నారు. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
చేపలు తినడం వల్ల శరీరంలో సెరటోనిన్, డోపమైన్ అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీంతో మానసికంగా, శరీరకంగా ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుందట. క్రమం తప్పకుండా చేపలు తింటే డిప్రెషన్ ను దూరం చేసుకోవచ్చట.
మతి మరుపు ఉండదు:
చేపలు తింటే మతి మరుపును తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మతి మరుపు రావడం అనేది సహజం. ఈ మతి మరుపును రోజూ చేపలు తినడం వల్ల తగ్గించుకోవచ్చంట. అలాగే చాలా మంది అల్జీమర్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు చేపలు తినడం వల్ల మతి మరుపును తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా చేపలు ముందుంటాయట.
కంటి చూపు సమస్యలు ఉండవు:
క్రమం తప్పకుండా చేపలు తినే వారిలో కంటి చూపు సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయని అంటున్నారు.
గుండె సమస్యలు ఉండవు:
గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవారు ముఖ్యంగా చేపలు తింటే ఈ సమస్య తగ్గుతుందని అంటున్నారు. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. రక్త నాళాల్లో అడ్డంకులు లేకుండా చూస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అలాగే పీరియడ్స్ సరిగా రాని మహిళలు చేపలు తింటే ఆ సమస్య తగ్గుతుందట. కీళ్ల నొప్పులు, క్యాన్సర్ వంటి సమస్యలు వంటికి రాకుండా ఇవి నిరోధిస్తాయి. కాబట్టి చికెన్, మటన్ కంటే చేపలు తింటే ఎక్కువ శాతం రోగాలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి