Millets for Childrens: ఎదిగే పిల్లలకు మిల్లేట్స్ పెట్టొచ్చా? పెడితే ఏం జరుగుతుంది?

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. అందులోనూ ముఖ్యంగా పిల్లల విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు పెద్దలు. వారికి బలవర్థకరమైన ఆహారాలనే పెట్టాలి అనుకుంటారు. పిల్లలు ఎప్పుడూ బలంగా, బొద్దుగా, స్ట్రాంగ్ గా ఉండాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆరాటా పడుతూంటారు. ఈ క్రమంలో చాలా మంది పిల్లలకు మిల్లేట్స్ ని పెడుతూంటారు. పిల్లలకు పోషకాహారం చాలా ఇంపార్టెంట్. అలాంటి పోషక విలువలు ఉన్న ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏవి ఎలా తీసుకుంటే పోషక విలువలు..

Millets for Childrens: ఎదిగే పిల్లలకు మిల్లేట్స్ పెట్టొచ్చా? పెడితే ఏం జరుగుతుంది?
Millets
Follow us

|

Updated on: Sep 13, 2023 | 2:51 PM

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. అందులోనూ ముఖ్యంగా పిల్లల విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు పెద్దలు. వారికి బలవర్థకరమైన ఆహారాలనే పెట్టాలి అనుకుంటారు. పిల్లలు ఎప్పుడూ బలంగా, బొద్దుగా, స్ట్రాంగ్ గా ఉండాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆరాటా పడుతూంటారు. ఈ క్రమంలో చాలా మంది పిల్లలకు మిల్లేట్స్ ని పెడుతూంటారు. పిల్లలకు పోషకాహారం చాలా ఇంపార్టెంట్. అలాంటి పోషక విలువలు ఉన్న ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏవి ఎలా తీసుకుంటే పోషక విలువలు పిల్లలకు అందుతాయో ఇప్పుడు చూద్దాం.

జొన్నలు:

చిరు ధాన్యాల్లో ఒకటి జొన్నలు. ఇవి కూడా పిల్లల ఎదుగుదలకు బాగా సహకారం అందిస్తాయి. జొన్నల్లో ఫైబర్, ఐరన్, ప్రొటీన్, మెగ్నీషియం వంటివి మెండుగా ఉంటాయి. ఇవి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎముకలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్లడ్ సర్క్యూలేషన్ ని పెంచుతుంది. వీటిని రొట్టెల్లా లేదా స్నాక్స్ లా అయినా చేసి ఇవ్వొచ్చు.

ఇవి కూడా చదవండి

రాగులు:

రాగులు కూడా పిల్లల ఎదుగుదలకు బాగా సహకరిస్తాయి. వీటిల్లో ముఖ్యంగా ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పురాతన కాలం నుంచి కూడా రాగులను ఎక్కువగా ఆహారంలో తీసుకునే వారు. రాగుల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి రాహులు తింటే ఎముకలు గట్టిగా ఉండటమే కాకుండా ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా రావు. రాగుల్లో ఉండే విటమిన్ సి, ఐరన్ పిల్లల్లో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. వీటిని ఎలాగైనా చేసుకుని తీసుకోవచ్చు.

రాజ్ గిరా:

చాలా మందికి రాజ్ గిరా గురించి తెలీదు. రాజ్ గిరాలో కూడా ప్రొటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని పిల్లలకు ఇస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వారికి ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. వీటిని దోశలుగా వెజిటేబుల్స్ తో కలిపి స్నాక్స్ గా, లడ్డూలా చేసి కూడా పిల్లలకు ఇవ్వొచ్చు.

బార్లీ:

బార్లీ కూడా పిల్లలకు మంచి పోషణను అందిస్తుంది. బార్లీలో విటమిన్ బీ1, మెగ్నీషియం, సెలీనియం, ఫాస్పరస్, మాంగనీస్ వంటివి ఖనిజాలు ఉంటాయి. వీటిని పిల్లలకు సూప్ లా, గంజిలా చేసి ఇవ్వొచ్చు.

కొర్రలు:

కొర్రలు కూడా పిల్లల ఆరోగ్యానికి చాలా మంచివి. కొర్రల్లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. వీటిని స్నాక్స్ లేదా బ్రేక్ ఫాస్ట్ లో పొంగల్, కిచిడి, జావలా కాసి ఇవ్వొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు