Banana Hair Pack: జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే అరటి పండుతో ఇలా చేయండి!!

జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ మగువలకు ముఖ్యంగా జుట్టే ఆకర్షణీయం. జుట్టు కోసం ఎన్నో తిప్పలు పడుతూంటారు కొందరు. అందులోనూ ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి.. ఈ సమయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా.. జుట్టు రాలడం ఆగదు. కాబట్టి ఇంట్లోని దొరికే పదార్థాలతోనే చిన్న చిన్న చిట్కాలను పాటించి జుట్టును కాపాడుకోవచ్చు. ఆడవారికైనా, మగవారికైనా జుట్టు బావుంటేనే అందంగా కనిపిస్తారు. జుట్టును కాపాడటంలో అరటి పండు కూడా ఒకటి. ఈ బనానాతో ఓ హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకుని వేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మరి హెయిర్..

Banana Hair Pack: జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే అరటి పండుతో ఇలా చేయండి!!
Banana
Follow us

|

Updated on: Sep 13, 2023 | 2:55 PM

జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ మగువలకు ముఖ్యంగా జుట్టే ఆకర్షణీయం. జుట్టు కోసం ఎన్నో తిప్పలు పడుతూంటారు కొందరు. అందులోనూ ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి.. ఈ సమయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా.. జుట్టు రాలడం ఆగదు. కాబట్టి ఇంట్లోని దొరికే పదార్థాలతోనే చిన్న చిన్న చిట్కాలను పాటించి జుట్టును కాపాడుకోవచ్చు. ఆడవారికైనా, మగవారికైనా జుట్టు బావుంటేనే అందంగా కనిపిస్తారు. జుట్టును కాపాడటంలో అరటి పండు కూడా ఒకటి. ఈ బనానాతో ఓ హెయిర్ ప్యాక్ ను తయారు చేసుకుని వేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మరి హెయిర్ ప్యాక్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? మిగతా కొన్ని పదార్థాలను కూడా ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండు:

బనానాతో కేవలం ఆరోగ్యాన్నే కాదు.. జుట్టుకు కూడా పోషణ అందించవచ్చు. ఇప్పుడున్న కాలంలో పొల్యూషన్ బాగా ఎక్కువగా ఉంటుంది. దీంతో జుట్టు రంగును, మెరుపును పోగొట్టుకుంది. అలాగే నేటి కాలంలో తినే ఆహారం వల్ల కూడా కురులు బలాన్ని కోల్పోతున్నాయి. ఇలాంటి సమస్యలు అన్నీ పోయి.. జుట్టు బలంగా నిగనిగలాడాలంటే.. అరటి పండు బాగా సహాయ పడుతుంది.

ఇవి కూడా చదవండి

బనానా హెయిర్ ప్యాక్:

ఈ ప్యాక్ ని తయారు చేసుకోవడానికి ముందు ఒక చిన్న గిన్నె తీసుకోండి. అందులో అరటి పండు ముక్కలు, కొద్దిగా ఆముదం, పెరుగు, అలోవెరా జెల్ కొంచెం వేసి వాటిని మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ఓ అరగంట సేపు ఉంచుకుని.. షాంపూతో తల స్నానం చేసుకోవాలి. ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ఈ ప్యాక్ ప్రయోజనాలు:

ఈ ప్యాక్ లో కలిపిన పెరుగు వల్ల జుట్టు షైనీగా కనిపిస్తుంది. చుండ్రు సమస్యలు ఉన్నా తగ్గుతాయి. జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.

ఆముదం వల్ల జుట్టు పెరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు బలంగా తయారయ్యేలా చేస్తుంది. పాత కాలంలో అయితే ఆముదాన్నే ఎక్కువగా జుట్టుకు రాసుకునేవారు.

కలబంద లేదా అలోవేరా కూడా జుట్టు పోషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గునాలు, యాంటీ మైక్రోబయల్, ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ లక్షణాలు జుట్టుపై దురద, చుండ్రు వంటి వాటిని తగ్గిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి