AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Precautions: గుండె ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఈ ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకోండి!

ఇప్పుడున్న కాలనుగుణంగా ఆరోగ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జాగ్రత్తలు తీసుకుంటేనే కనీసం కొన్ని రోజులైనా ఆరోగ్యంగా బ్రతికే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు దొరొకే అన్నింటిలో కల్తీ రాజ్యమేలుతోంది. కల్తీ లేని ఆహారం దొరకాలంటే గగనంగా మారింది. ఇలాంటి సమయంలో ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిందే. లేదంటే అనారోగ్య జబ్బుల బారిన పడతాం. మనకు తెలియకుండానే నీరసం, అలసటతో క్రుంగిపోతాం. అందులోనూ ఇప్పుడు వరుసగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ మధ్య గుండె జబ్బులతో మరణిస్తున్నారు. మారిన జీవన విధానం, ఆహార శైలి కారణంగా చాలా మంది..

Heart Precautions: గుండె ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఈ ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకోండి!
Heart
Chinni Enni
|

Updated on: Sep 13, 2023 | 4:08 PM

Share

ఇప్పుడున్న కాలనుగుణంగా ఆరోగ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జాగ్రత్తలు తీసుకుంటేనే కనీసం కొన్ని రోజులైనా ఆరోగ్యంగా బ్రతికే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు దొరొకే అన్నింటిలో కల్తీ రాజ్యమేలుతోంది. కల్తీ లేని ఆహారం దొరకాలంటే గగనంగా మారింది. ఇలాంటి సమయంలో ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిందే. లేదంటే అనారోగ్య జబ్బుల బారిన పడతాం. మనకు తెలియకుండానే నీరసం, అలసటతో క్రుంగిపోతాం. అందులోనూ ఇప్పుడు వరుసగా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ మధ్య గుండె జబ్బులతో మరణిస్తున్నారు. మారిన జీవన విధానం, ఆహార శైలి కారణంగా చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తినే ఫ్రూట్స్ కూడా బాగా కల్తీ అయిపోతున్నాయి. కాబట్టి ఏం తినాలో తెలీక తికమక పడుతున్నారు జనం. ఈ క్రమంలో హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు.. ఎలాంటి ఆహారం తింటే గుండెకు మేలు జరుగుతుందో అధ్యయనం చేశారు. అవి ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్:

గత కొంత కాలంగా ఓట్స్ కి కూడా బాగా ప్రాముఖ్యత పెరిగింది. ఇప్పుడు అన్ని రకాల మార్కెట్లలో కూడా విరివిగా ఓట్స్ లభ్యం అవుతున్నాయి. కాబట్టి ప్రతి రోజూ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి. వీటిల్లో బీటా గ్లూకాన్న ఉంటుంది. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ఓట్స్ తో రకరకాల ఆహారాలు చేసుకుని తినొచ్చు.

ఇవి కూడా చదవండి

బీన్స్:

చాలా మంది బీన్స్ ని తినడానికి ఇష్టపడరు. కానీ ఇందులో గుండెకు మేలు చేసే అన్ని రకాల గుణాలు ఉన్నాయి. కనీసం వారానికి ఒక్క సారైనా బీన్స్ ని తింటే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తింటే వెంటనే ఆకలి వేయదు. అలాగే వంకాయ, బెండకాయ వంటి కూరగాయలు కూడా గుండె హెల్దీగా ఉండేలా చస్తాయి.

నట్స్:

ప్రతి రోజూ అన్ని రకాల నట్స్ కలిపి గుప్పెడు తింటే గుండె ఆరోగ్యమే కాకుండా.. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. ఇవి తింటే వచ్చే అనారోగ్య సమస్యలు కూడా తక్కువ. వేరు శనగ కూడా చాలా మంచిది. నట్స్ తో పాటే కలిపి తీసుకోవచ్చు. నేరుగా తినే కంటే వీటిని నానబెట్టి తింటేనే హెల్త్ కి చాలా మంచింది. చెడు కొలెస్ట్రాల్.. రక్తంలో కలవకుండా నట్స్ లోని ఫైబర్ అడ్డుకుంటుంది.

సిట్రస్ ఫ్రూట్స్:

సిట్రస్ ఫ్రూట్స్ ఏవైనా కూడా గుండెకు చాలా మంచి చేస్తాయి. స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, బొప్పాయి, అవకాడో, యాపిల్ వంటివి రోజూ తింటూ ఉంటే.. గుండె జబ్బులు తగ్గించుకోవచ్చు. ఈ సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి. గుండెకు రక్షణగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి