Onion and Garlic: ఉల్లిపాయ – వెల్లుల్లి వీటిలో మన ఆరోగ్యానికి ఏది బెటర్? ఏది ఎక్కువగా తీసుకోవచ్చు!

'ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు'.. ఊరికే రాలేదు ఆ సామెత. ఉల్లిపాయకు ఉండే చరిత్ర అలాంటిది మరి. ఇక వెల్లుల్లితో అనేక దీర్ఘకాలిక మన శరీరానికి ఏవి మంచివి? ఏవి తింటే ఆరోగ్యంగా ఉంటామో.. పురాతన కాలంలోనే పెద్దలు చెప్పేశారు. కానీ మనం వాటిని పట్టించుకోకుండా.. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ లు తింటూ అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. ఏదో అప్పడప్పుడు అయితే ఓకే కానీ.. నిత్యం వీటిపైనే ఆధార పడి ఉంటే మాత్రం చాలా డేంజర్. ఈ విషయం పక్కన పెడితే.. ఉల్లి పాయ - వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్యకరమైన..

Onion and Garlic: ఉల్లిపాయ - వెల్లుల్లి వీటిలో మన ఆరోగ్యానికి ఏది బెటర్? ఏది ఎక్కువగా తీసుకోవచ్చు!
Onion Garlic
Follow us
Chinni Enni

|

Updated on: Sep 11, 2023 | 10:00 PM

‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు’.. ఊరికే రాలేదు ఆ సామెత. ఉల్లిపాయకు ఉండే చరిత్ర అలాంటిది మరి. ఇక వెల్లుల్లితో అనేక దీర్ఘకాలిక మన శరీరానికి ఏవి మంచివి? ఏవి తింటే ఆరోగ్యంగా ఉంటామో.. పురాతన కాలంలోనే పెద్దలు చెప్పేశారు. కానీ మనం వాటిని పట్టించుకోకుండా.. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ లు తింటూ అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. ఏదో అప్పడప్పుడు అయితే ఓకే కానీ.. నిత్యం వీటిపైనే ఆధార పడి ఉంటే మాత్రం చాలా డేంజర్. ఈ విషయం పక్కన పెడితే.. ఉల్లి పాయ – వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది ఎక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యం మెరుగు పడుతుంది? దేని వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లితో ఎన్నో బెనిఫిట్స్:

ఉల్లి పాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో పాటు యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా, ఇన్ ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటాం. అలాగే ఉల్లిలో క్యాన్సర్ ను నిరోధించే లక్షణాలు ఉన్నాయి. ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్, పెద్ద పేగు సమస్యలు, ఊబకాయం, రక్త పోటు, హైబీపీ, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్ హైబీవీ వంటివి రాకుండా ఉంటాయి. అదే విధంగా ఆనియన్ తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. ఉల్లితో ముఖ్యంగా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లిలో సూపర్ ప్రయోజనాలు:

ఉల్లి పాయలో ఉండే ప్రయోజనాలే వెల్లుల్లిలో కూడా ఉంటాయి. ఇది తీసుకున్నా కూడా అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. వెల్లుల్లి రెబ్బలను పరగడుపున తీసుకుంటే అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెల్లుల్లిని తేనెతో తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం. ఇలా ఆయుర్వేద నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటే.. వెల్లుల్లితో అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చెక్ పెట్టవచ్చు.

అయితే ఉల్లితో పోలిస్తే వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. దీని ఘాటు కారణంగా గుండెల్లో మంట, కడుపులో మంట, వాంతులు, అలర్జీలు, రక్త స్రావం, వికారం, విరేచనాలు, నోటి దుర్వాసన వంటి సమస్యలు వస్తాయి. కానీ ఉల్లిపాయతో ఇలాంటి సైడ్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. అయితే వెల్లుల్లిని తక్కువ మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచింది. లేదంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి