రాత్రిళ్లు సాక్సులు ధరించి నిద్ర పోతున్నారా? ఐతే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే..
రాత్రంతా మంచి నిద్ర కోసం గదిలో డిమ్ లైట్లు, స్లో మ్యూజిక్ లేదా నిశ్శబ్ద వాతావరణంలో నిద్రపోవడానికి చాలా మంది ఇష్టపడతారు. చాలా మంది సాక్స్ ధరించి రాత్రి వేళల్లో నిద్రపోతుంటారు. ముఖ్యంగా శీతాకాలం, వర్షాకాలంలో సాక్స్‌తోనే నిద్రపోతుంటారు. కానీ రాత్రిపూట ఇలా సాక్స్ ధరించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు..
రాత్రంతా మంచి నిద్ర కోసం గదిలో డిమ్ లైట్లు, స్లో మ్యూజిక్ లేదా నిశ్శబ్ద వాతావరణంలో నిద్రపోవడానికి చాలా మంది ఇష్టపడతారు. చాలా మంది సాక్స్ ధరించి రాత్రి వేళల్లో నిద్రపోతుంటారు. ముఖ్యంగా శీతాకాలం, వర్షాకాలంలో సాక్స్‌తోనే నిద్రపోతుంటారు. కానీ రాత్రిపూట ఇలా సాక్స్ ధరించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చల్లని వాతావరణంలో ఉపయోగించే బెడ్ సాక్స్ నిద్ర నాణ్యతపై సానుకూల ప్రభావం చూపినప్పటికీ కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. అవేంటంటే..
రాత్రిపూట సాక్స్ ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. మరోవైపు బిగుతుగా ఉండే సాక్స్‌లు వేసుకుంటే కొన్ని శారీరక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. వైద్యులు సాక్స్ ధరించమని సూచిస్తే తప్ప వాటిని ధరించి నిద్రపోకూడదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి బిగుతుగా ఉండే సాక్స్‌లు కాళ్లలో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. సాక్స్ ధరించి పడుకున్నప్పుడు రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడుతుంది. రోజూ సాక్స్ ధరించే వారి శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా సాక్స్‌లు బిగుతుగా ఉండి గాలి వాటి గుండా వెళ్లనప్పుడు.. పాదాలు వేడిగా ఉండటమేకాకుండా చెమట పట్టినట్లు అనిపిస్తుంది. తరచూ ఇలా జరిగితే ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ దారి తీస్తుంది.
నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం.. ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా గోళ్ళ అంచు నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అది పాదమంతా వ్యాప్తి చెందుతుంది. ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ వల్ల గోళ్లు రంగు మారడం, మందంగా, పెళుసుగా మారడం జరుగుతుంది. ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు గోళ్ల చుట్టుపక్కల చర్మం వాపు వచ్చి నొప్పి కలిగిస్తుంది. మీకు కూడా ఈ సమస్య ఉంటే వెంటనే సాక్స్ ధరించి నిద్రపోవడం మానేయండి.
ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం వారికే ఎక్కువ
ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ స్త్రీల కంటే పురుషులకే అధికంగా వస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ ఇన్ఫెక్షన్ పిల్లల కంటే పెద్దలకే ఎక్కువగా కనిపిస్తుంది. మీ కుటుంబంలో ఎవరికైనా తరచుగా ఈ రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు సంభవిస్తుంటే సాక్స్ ధరించడం మానేయండి. వృద్ధుల్లో ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ గోళ్లు కూడా నెమ్మదిగా పెరిగి మందంగా మారుతాయి. పైగా వృద్ధుల్లో తక్కువ రక్త ప్రసరణ ఉంటుంది. అటువంటి వారు సాక్స్‌లు ధరించకపోవడమే బెటర్ అంటున్నారు నిపుణులు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.