Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Highlights: జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్‌ కోరిన WTO డైరెక్టర్ జనరల్‌.. బైడెన్‌తో సెల్పీ! వీడియో వైరల్

జీ20 సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి దేశాధినేతలు న్యూఢిల్లీ వచ్చారు. వివిధ అంతర్జాతీయ సంస్థల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ లేచి నిలబడి అందరికీ అభివాదం చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకోంజో యెల్లా జీ20లో పాల్గొనేందుకు..

G20 Highlights: జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్‌ కోరిన WTO డైరెక్టర్ జనరల్‌.. బైడెన్‌తో సెల్పీ! వీడియో వైరల్
WTO Chief Ngozi Okonjo-Iweala and PM Modi
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 11, 2023 | 3:59 PM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: జీ20 సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి దేశాధినేతలు న్యూఢిల్లీ వచ్చారు. వివిధ అంతర్జాతీయ సంస్థల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ లేచి నిలబడి అందరికీ అభివాదం చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకోంజో యెల్లా జీ20లో పాల్గొనేందుకు గత గురువారం (సెప్టెంబర్‌ 7) రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. శనివారం జరిగిన సదస్సులో మోదీని ఒకోంజో యెల్లా కలిశారు. అక్కడ మోదీతో కరచాలనం చేశారు. కరచాలనం చేసిన అనంతరం నరేంద్ర మోదీ ‘Modi@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ పుస్తకాన్ని యెల్లాకు అందజేశారు. ఆ సమయంలో యెల్లా ఆటోగ్రాఫ్ కోరగా మోదీ స్వయంగా ఆ పుస్తకంపై సంతకం (ఆటోగ్రాఫ్‌) చేసి ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌ యెల్లాకు అందజేశారు. ఆ తర్వాత మోదీ, యెల్లాతో కొంత సమయం సంభాషించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన G20 సమావేశానికి భారత్‌ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 18న ముగిసిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో భారత్‌ ప్రత్యేకను చాటుకొంది. దేశ ప్రధాని విదేశీ నాయకులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతినిథులకు ఆతిథ్యం ఇచ్చారు. సమ్మిట్‌కు WTO డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకోంజో యెల్లా కూడా హాజరయ్యారు. ఈ సదస్సు ద్వారా భారత్‌ భవిష్యత్తులో అతిపెద్ద శక్తులలో ఒకటిగా ప్రపంచానికి చాటి చెప్పగలిగింది. భారత్ చొరవతో ఆఫ్రికన్ యూనియన్ G20 గ్రూప్‌లో 21 దేశంగా సభ్యత్వం పొందింది. ఈ సమావేశంలో న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇది భారత్‌కు పెద్ద దౌత్య విజయంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమావేశంలో భారత్ యుద్ధ వ్యతిరేక సందేశం ఇచ్చింది. ప్రధాని మోదీ అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అభివృద్ధి సందేశాన్ని అందించారు.

ఇవి కూడా చదవండి

ఈ G20 సమావేశంలో కొన్ని ముఖ్యమైన పరిణాలు హైలెట్‌గా నిలిచాయి. ఈ సదస్సులో భారత్‌-మిడిల్‌ ఈస్ట్‌-యూరప్‌ మధ్య ఎకనామిక్‌ కారిడార్‌ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అమెరికా చొరవతో ఈ కారిడార్‌ను ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఆగ్నేయాసియా, ఐరోపా మధ్య వాణిజ్యాలకు కొత్త క్షితిజాలని నిస్సందేహంగా తెరుస్తుంది.

జీ20 సమావేశంతో పాటు పలు దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. వివిధ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ దేశాధినేతలు ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిన్నర్‌కు హాజరయ్యారు. ప్రపంచ నాయకులతో చర్చలు జరిపారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సెల్ఫీ కూడా తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.