సుప్రీంకోర్టు న్యాయవాది దారుణ హత్య.. హంతకుడెవరో తెలిస్తే షాక్ అవుతారు! భయంతో 36 గంటలు స్టోర్ రూంలోనే..

సుప్రీంకోర్టు న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదంలో భర్తే మహిళా లాయర్‌ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడు వారి బంగ్లాలో 36 గంటలకుపైగా దాక్కున్నాడు. చివరికి పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంతకీ..

సుప్రీంకోర్టు న్యాయవాది దారుణ హత్య.. హంతకుడెవరో తెలిస్తే షాక్ అవుతారు! భయంతో 36 గంటలు స్టోర్ రూంలోనే..
Supreme Court Lawyer Renu Sinha
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 11, 2023 | 3:14 PM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: సుప్రీంకోర్టు న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదంలో భర్తే మహిళా లాయర్‌ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడు వారి బంగ్లాలో 36 గంటలకుపైగా దాక్కున్నాడు. చివరికి పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మహిళా లాయర్‌ రేణు సిన్హా (61) భర్త నితిన్ నాథ్ సిన్హాతో కలిసి నోయిడా సెక్టార్‌ 30లోని వారి బంగ్లాలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు విదేశాల్లో ఉండగా దంపతులిద్దరూ అక్కడే గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో న్యాయవాది రేణు సిన్హా తాజాగా దారుణ హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహం వారి బంగ్లాలోని బాత్‌రూమ్‌లో శనివారం లభ్యమైంది. మరోవైపు ఆమె భర్త నితిన్ నాథ్ సిన్హా గత రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు అతని ఫోన్‌ కాల్స్‌ ట్రాక్‌ చేసి ఈ రోజు అరెస్ట్‌ చేశారు. గత రెండు రోజులుగా నితిన్ నాథ్ సిన్హా బంగ్లా స్టోర్ రూమ్‌లోనే దాక్కున్నట్లు సమాచారం. . గడచిన రెండు రోజులుగా న్యాయవాది రేణు సిన్హా సోదరుడు ఆమెకు ఫోన్‌ కాల్ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రేణు సిన్హా నివాసం ఉంటోన్న బంగ్లా వద్దకు చేరుకుని సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బాత్‌రూంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె భర్త కనిపించకుండా పోవడంతో న్యాయవాది రేణు సిన్హా భర్తే ఆమెను హత్య చేసి ఉంటాడని సోదరుడు ఆరోపించాడు. ఈ దారుణ ఘటన శనివారం (సెప్టెంబర్‌ 9) వెలుగు చూసింది.

మృతురాలి భర్త కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పోలీసులు సిన్హా ఫోన్‌ను ట్రాక్ చేయగా వారు నివాసం ఉంటోన్న బంగ్లాను చూపింది. పోలీసులు మరోమారు బంగ్లా మొత్తం వెదకగా స్టోర్ రూమ్‌లో దాక్కున్న నితిన్ నాథ్ సిన్హాను గుర్తించి అరెస్ట్ చేశారు. తమ బంగ్లాను విక్రయించే విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలే న్యాయవాది హత్యకు దారితీనట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. న్యాయవాది రేణు సిన్హా తాను నివాసం ఉంటోన్న బంగ్లాను విక్రయించాలని భావించారు. దీనిలో భాగంగా కొనుగోలుదారు నుంచి నగదును కూడా తీసుకున్నారు. అయితే బంగ్లాను అమ్మడం ఆమె భర్త నితిన్ నాథ్ సిన్హాకు ఇష్టం లేదు. ఈ వ్యవహారం దంపతుల మధ్య వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, అందువల్లనే భార్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.