AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన నలుగురు పిల్లల తల్లి.. అనంతరం రోడ్డు పక్కన నీళ్ల గుంతలో..

మద్యం మత్తులో ఉన్న భర్తను ఓ భార్య ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేయించింది. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్‌లో ఎక్కించి రోడ్డుపక్కన ఉన్న గొయ్యిలో పడేసింది. ఎవరికీ తెలియదులే అనుకుంది. కానీ నిఘా నేత్రాలు వారి పాపాన్ని పోలీసులకు పట్టించాయి. ఈ షాకింగ్‌ ఘటన..

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన నలుగురు పిల్లల తల్లి.. అనంతరం రోడ్డు పక్కన నీళ్ల గుంతలో..
Wife Killed Husband
Srilakshmi C
|

Updated on: Sep 10, 2023 | 7:20 PM

Share

లక్నో, సెప్టెంబర్‌ 10: మద్యం మత్తులో ఉన్న భర్తను ఓ భార్య ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేయించింది. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్‌లో ఎక్కించి రోడ్డుపక్కన ఉన్న గొయ్యిలో పడేసింది. ఎవరికీ తెలియదులే అనుకుంది. కానీ నిఘా నేత్రాలు వారి పాపాన్ని పోలీసులకు పట్టించాయి. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాకు చెందిన కమతా కబీర్ (35), అంజు దంపతులు. వీరికి నలుగు సంతానం. వీరు స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించేవారు. మద్యానికి బానిసైన కబీర్ నిత్యం భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలో భార్య అంజు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త వేధింపులు తాళలేక భార్య అంజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది చేసింది. ఈక్రమంలో భర్తను హతమార్చడానికి అంజు ప్రియుడితో కలిసి కుట్రపన్నింది. పథకం ప్రకారం శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న కబీర్‌ను కొట్టి చంపించింది. అనంతరం మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న నీళ్ల గుంతలో పడేశారు. ఏమీ ఎరుగనట్లు ఇద్దరు వెళ్లిపోయారు. ఉదయం నీటితో నిండిన గోతిలో కబీర్ మృతదేహం లభ్యమైంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం మృతదేహం పడి ఉన్న తీరును బట్టి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. కదులుతున్న ట్రాక్టర్‌ నుంచి మృతదేహాన్ని రోడ్డుపక్కన ఉన్న నీళ్లతో నిండిన గుంతలోకి విసిరేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ఈ ఫుటేజీ ఆధారంగా మృతుడి భార్య అంజు, ఆమె ప్రియుడు వీరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. హమీర్‌పూర్ ఏఎస్పీ మాయారం వర్మ మాట్లాడుతూ..

ఆదివారం ఉదయం బేరిరోడ్డులో రోడ్డు పక్కన నీళ్ల గుంతలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కురారా పట్టణానికి చెందిన కమతా కబీర్‌గా గుర్తించారు. కమత ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకుని నడిపేవాడు. భర్త మృతి చెందిన సమాచారం అందుకున్న మృతుడి భార్య పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తన భర్త మద్యానికి బానిసయ్యాడని, రాత్రి మద్యం మత్తులో గొయ్యిలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులకు తెలిపింది. అంజు మాటలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఘటనా స్థలం సమీపంలోని సీసీటీవీని పరిశీలించారు. హత్య చేసి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేసినట్లు తేలింది. తన భార్యకు డ్రైవర్‌తో ఉన్న అక్రమ సంబంధం గురించి మృతుడికి తెలియడంతో ఈ దారుణానికి దాని తీసింది. భార్య తన ప్రియుడితో కలిసి ఇంట్లోనే కొట్టి చంపి మృతదేహాన్ని ట్రాక్టర్‌లో ఎక్కించి బయటకు విసిరేసినట్లు ఎస్పీ మాయారం వర్మ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us