Indian Coast Guard Jobs 2023: ఇండియన్ కోస్ట్ గార్డులో 350 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పదో తరగతి/ఇంటర్ అర్హత..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన యూనియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో.. 2023-24 బ్యాచ్‌కు సంబంధించి 350 నావిక్, యాత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ కోస్ట్ గార్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచుల్లో..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన యూనియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో.. 2023-24 బ్యాచ్‌కు సంబంధించి 350 నావిక్, యాత్రిక్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ కోస్ట్ గార్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచుల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
నావిక్ (డొమెస్టిక్ బ్యాంచ్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో 10+2 లేదా ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. యాత్రిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యునికేషన్ (రేడియో/పవర్) ఇంజనీరింగ్లో మూడు లేదా నాలుగేళ్ల డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా పదో తరగతితోపాటు ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణ పొంది ఉండాలి. ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యునికేషన్ (రేడియో/పవర్) ఇంజనీరింగ్లో రెండు లేదా మూడు ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు మే 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ అర్హతలున్న వారు సెప్టెంబర్ 22, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యింది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.300లు రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానం..
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 రాత పరీక్షలు, వైద్య పరీక్షలు, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. స్టేజ్ 1 పరీక్ష డిసెంబర్ 2023లో, స్టేజ్ 2 జనవరి 2024, స్టేజ్ 3 పరీక్ష ఏప్రిల్ లేదా మే 2024లో ఉంటుంది. ఎంపికైన వారికి నావిక్ పోస్టులకు నెలకు రూ.21,700, యాంత్రిక్ పోస్టులకు నెలకు రూ.29,200 చొప్పున జీతంగా చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు:
- నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టులు: 260
- నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులు: 30
- యాంత్రిక్ (మెకానికల్) పోస్టులు: 25
- యాంత్రిక్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 20
- యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు: 15
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.