Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే అమ్మాయిలు ‘నో’ చెప్తారట.. అబ్బాయిలు ఈ విషయాల్లో బీకేర్‌ ఫుల్!

ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవ్వరం పక్కాగా ప్లాన్‌ చెయ్యలేం. ఐతే తొలిచూపులోనే మనసు దొచుకున్న ఇష్ట సఖిని మెప్పించాలంటే అదొక పెద్ద యుద్ధమే అవుతుంది యువకులకు. ఎలా ఇంప్రెస్‌ చేయాలో తెలియక నానా విధాలుగా ఆలోచించి చివరికి ఓ నిర్ణయానికి వస్తారు. కానీ ప్రపోజ్‌ చేసిన వెంటనే అమ్మాయిలు అందరూ ఒకేరీతిలో 'నో' అనే మొదట చెబుతారు. ఈ విచిత్రమైన సమస్య దాదాపు ప్రతి ఒక్కరికీ..

అందుకే అమ్మాయిలు 'నో' చెప్తారట.. అబ్బాయిలు ఈ విషయాల్లో బీకేర్‌ ఫుల్!
Why Most Girls Say No To Love Proposal
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 10, 2023 | 4:09 PM

ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవ్వరం పక్కాగా ప్లాన్‌ చెయ్యలేం. ఐతే తొలిచూపులోనే మనసు దొచుకున్న ఇష్ట సఖిని మెప్పించాలంటే అదొక పెద్ద యుద్ధమే అవుతుంది యువకులకు. ఎలా ఇంప్రెస్‌ చేయాలో తెలియక నానా విధాలుగా ఆలోచించి చివరికి ఓ నిర్ణయానికి వస్తారు. కానీ ప్రపోజ్‌ చేసిన వెంటనే అమ్మాయిలు అందరూ ఒకేరీతిలో ‘నో’ అనే మొదట చెబుతారు. ఈ విచిత్రమైన సమస్య దాదాపు ప్రతి ఒక్కరికీ అనుభవమే. అందుకు కారణాలు లేకపోలేదు. సాధారణంగా అమ్మాయిలకు అభద్రతా భావం ఉంటుంది. గతంలో లేదా ప్రస్తుతం ఎప్పుడైనా చేదు అనుభవాలను చవిచూసి ఉంటే ఆ భయంలోనే ఉండిపోతారు. అందుకే వెంటనే ఎవరైనా ప్రపోజ్‌ చేస్తే వాళ్లు వెంటనే ఆ ప్రేమను తిరస్కరిస్తారట. అందుకే అమ్మాయిల మనస్తత్వం ఎవ్వరికీ తొందరగా అర్ధంకాదు. వారిని అర్థం చేసుకోవడానికి ధైర్యంతోపాటు సహనం కూడా చాలా అవసరం. అందుకే వారిని త్వరగా ఎవరూ అర్థం చేసుకోలేరు. అమ్మాయిల్లోని ఈ సందిగ్ధతను పట్టించుకోకుండా అసలు అర్ధం చేసుకునే ప్రయత్నం చేయకుండా ప్రపోజ్ చేస్తే వాళ్లు వెంటనే మీ ప్రేమను తిరస్కరిస్తారు. అంతేకాకుండా అమ్మాయిలు ప్రపోజ్‌ చేసినప్పుడు నో చెప్పడానికి మరోనాలుగు ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..

డ్రెస్సింగ్‌

అమ్మాయిలు ఈ విషయాల పట్ల చాలా సున్నితంగా ఉంటారు. ఎందుకంటే ఇతర విషయాలు పట్టించుకోవడాని కంటే ముందే తొలిసారి వారు చూపుకే ఆకర్షితులవుతారు. సాధారణంగా పొడవుగా , కండలు తిరిగిన దేహం, చక్కని ఛాయ, నీట్ హెయిర్‌కట్ ఉన్నవాళ్లను ఇష్టపడతారు. ఆకట్టుకునే డ్రెస్ కోడ్‌ అమ్మాయిలను అమితంగా ఆకట్టుకుంటుంది. ఏ కారణం లేకుండానే అమ్మాయిలు తిరస్కరించరనే విషయం అబ్బాయిలు గ్రహించాలి. మీకెప్పుడైనా ఇలాంటి అనుభం ఎదురైతే ముందుగా మీరు ధరించిన దుస్తులు ఎలా ఉన్నాయో పరిశీలించుకోవాలి. సరైన డ్రెస్సింగ్‌ సెన్స్ లేనివారిని ‘ప్లేబాయ్’గా పరిగణిస్తారు.

హాస్య చతురత

చాలా మంది కుర్రాళ్ళు తాము ప్రేమించే అమ్మాయిల పట్ల వారి వైఖరి మొదటి అభిప్రాయంలోనే గంభీరంగా కనిపించేటట్లు జాగ్రత్తపడతారు. కానీ అమ్మాయిలు మాత్రం హాస్య చతురత ఉన్న అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడతారు. మీలో సెన్సాఫ్ హ్యూమర్‌ గొప్పగా లేకపోయినా వారిపట్ల కోపంగా వ్యవహరిస్తే మీ ప్రేమ బోల్తాపడినట్లే.

ఇవి కూడా చదవండి

సంబాషణలు

ఆసక్తికరమైన సంభాషణలు చేసే వ్యక్తులను అమ్మాయిలు ఇష్టపడతారు. అంటే వాక్‌ చతురత ఉండాలి. మీరు మాట్లాడితే ఆమెకు విసుగు కలుగకుండా ఉండాలి. చెప్పే విషయానికి మీ తెలివితేటలను జోడించి ఆసక్తికరంగా మాట్లాడాలి. బోరింగ్ టాపిక్స్‌ వాళ్లతో చర్చించకూడదు. సైన్స్ ఫిక్షన్ టాపిక్‌లు, మేధోపరమైన విషయాలు సంభాషించేటప్పుడు ఫన్నీగా ఆసక్తికరంగా చెప్పగలగాలి.

ఆసక్తి, అభిరుచులు అడిగి తెలుసుకోవాలి

అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు వారి ఇష్టాయిష్టాలు అడిగి తెలుసుకోవాలి. ఆమె ఆసక్తులు, లక్ష్యాలు శ్రద్ధగా అడిగి తెలుసుకోవాలి. అమ్మాయిల మనసు గెలవడానికి ఇది మంచి ట్రిక్. ఎందుకంటే అమ్మాయిలు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఎల్లప్పుడు క్లాస్సిగా ఉండాలి. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వాళ్ల నిర్ణయాలను గౌరవించాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.