Skincare Tips: ముఖంపై ముడతలా..? ఈ యోగాసనాలు వేశారంటే వృద్ధాప్య ఛాయలు మాయం.. మెరిసే చర్మం మీ సొంతం..
Anti Ageing Tips: ఆకర్షణీయమైన, మెరిసే చర్మం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ పెరిగే వయసుతో పాటు చర్మంపై ముడతలు కూడా కనిపిస్తుంటాయి. వాతావరణ కాలుష్యం, విపరీతమైన కాస్మటిక్స్ వినియోగం కూడా చర్మంపై ముడతలు ఏర్పడడానికి కారణంగా మారుతున్నాయి. అయితే ముడతలకు చెక్ పెట్టి, చర్మం బిగుతుగా మెరిసేలా మారాలంటే కొన్ని రకాల యోగాసనాలు చేయడం మంచిదని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. ఆయా ఆసనాలు చర్మంపై ముడతలను తొలగించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వారు చెబుతున్నారు.
Updated on: Sep 10, 2023 | 4:18 PM

హలాసనం ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. ఈ క్రమంలో మెరిసే చర్మం కోసం హలాసనం చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో రక్తప్రసరణ పెరిగి ముఖంపై మచ్చలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది.

త్రికోణాసనం ఆరోగ్యానికే కాక ముఖ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేసే త్రికోణాసనం చేయడం వల్ల శరీరం రిఫ్రెష్‌గా ఉండడంతో పాటు ముఖంపై ముడతలు తొలగిపోతాయి.

భుజంగాసనం మచ్చలు, గాయలు కలిగిన కఠినమైన చర్మాన్ని నయం చేయడానికి ఉపయోగడుతుంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఉపయోగపడే ఈ భుజంగాసనం అన్ని భాగాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది.

మత్స్యాసనం చేయడం వల్ల శరీరంలోని హార్మోన్లు సమతుల్యం అవుతాయి. ఫలితంగా ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలు తొలగిపోవడంతో పాటు వృద్ధాప్య సంకేతాలైన ముడతలు మాయమైపోతాయి.

సర్వాంగాసనం సాధన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరాన్ని తలకిందులుగా ఉంచి చేసే ఈ యోగాసనం కారణంగా రక్త ప్రవాహం తల వైపు వస్తుంది. ఇలా జరగడం వల్ల ముఖ చర్మానికి మేలు జరగడంతో పాటు చర్మ సమస్యలు తొలగిపోతాయి. మెరుగైన రక్తప్రసరణ కారణంగా జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.




