- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Conditions for Director buchi babu and his next movie Telugu Heros Photos
Ram Charan: బుచ్చిబాబు తో సహా ఆ డైరెక్టర్స్ కు రామ్ చరణ్ కండిషన్స్.. ఏంటంటే..?
కండీషన్స్ అప్లై.. ఇప్పుడు తనతో సినిమాలు చేయాలనుకుంటున్న దర్శకులకు రామ్ చరణ్ చెప్తున్న మాట ఇదే. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న సినిమా ఆలస్యం అవుతుండటంతో.. సెట్స్‌పైకి రావాల్సిన సినిమాలకు ముందుగానే కండీషన్స్ పెడుతున్నారు చరణ్. అందులో ముందుగా బుచ్చిబాబుకే ఈ కండీషన్స్ అప్లై కానున్నాయి. ఇంతకీ చరణ్ పెట్టిన ఆ కండీషన్స్ ఏంటి..? దానివల్ల చరణ్‌కు ఏంటి ఉపయోగం..?
Updated on: Sep 10, 2023 | 3:59 PM

కండీషన్స్ అప్లై.. ఇప్పుడు తనతో సినిమాలు చేయాలనుకుంటున్న దర్శకులకు రామ్ చరణ్ చెప్తున్న మాట ఇదే. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న సినిమా ఆలస్యం అవుతుండటంతో.. సెట్స్‌పైకి రావాల్సిన సినిమాలకు ముందుగానే కండీషన్స్ పెడుతున్నారు చరణ్.

అందులో ముందుగా బుచ్చిబాబుకే ఈ కండీషన్స్ అప్లై కానున్నాయి. ఇంతకీ చరణ్ పెట్టిన ఆ కండీషన్స్ ఏంటి..? దానివల్ల చరణ్‌కు ఏంటి ఉపయోగం..? ట్రిపుల్ ఆర్‌కు ముందు వచ్చిన భారీ గ్యాప్‌ను వరస సినిమాలతో భర్తీ చేయాలని చరణ్ భావిస్తున్నారు కానీ ఆయనతో సినిమాలకు కమిటైన దర్శకులు మాత్రం అది కానిచ్చేలా కనిపించడం లేదు.

ఇప్పటికీ శంకర్ సినిమా సగం కూడా పూర్తవ్వలేదు.. 2023లోనే రావాల్సిన ఈ చిత్రం ఎప్పుడొస్తుందో ఓ క్లారిటీ లేదు. దాంతో ఈయన ఫోకస్ బుచ్చిబాబుపైకి షిఫ్ట్ అవుతుంది. శంకర్ సినిమా ఎలాగూ తన చేతుల్లో లేదు కాబట్టి.. బుచ్చిబాబు ప్రాజెక్ట్ మాత్రం ఎట్టి పరిస్థితిలో లేట్ అవ్వొద్దని చరణ్ చెప్పినట్లు తెలుస్తుంది.

షెడ్యూల్స్ గ్యాప్ ఎక్కువా లేకుండా వీలైనంత వేగంగా సినిమా పూర్తి చేయాలని దర్శకుడికి చరణ్ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. 2019 తర్వాత ఒకే సినిమాతో వచ్చారు చరణ్. అందుకే స్పీడ్ పెంచుతున్నారు చరణ్. 2024లోనే గేమ్ ఛేంజర్, బుచ్చిబాబు సినిమాలు విడుదల చేయాలనేది చరణ్ ప్లాన్.

ఇప్పటికే తన సినిమాకు ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టారు బుచ్చిబాబు. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని చూస్తున్నారు. అన్నీ కుదిర్తే డిసెంబర్ నుంచి RC16 సెట్స్‌పైకి వెళ్లడం ఖాయం.

అదే జరిగితే ఇటు గేమ్ ఛేంజర్.. అటు బుచ్చి సినిమాలు ఒకేసారి పూర్తి చేయాలని ఫిక్సయ్యారు చరణ్. ఈ రెండు సినిమాల్లోనూ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.. రెండూ పీరియాడిక్ సినిమాలే కావడం గమనార్హం.





























