AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS TET 2023 Hall Tickets: సెప్టెంబర్ 15న తెలంగాణ టెట్‌ పరీక్ష.. మొత్తం ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారంటే..

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2023 హాల్‌ టికెట్లు శనివారం (సెప్టెంబర్‌ 9) టెట్‌ కన్వీనర్, రాష్ట్ర విద్యా పరిశోధన & శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సంచాలకురాలు రాధారెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు దరఖాస్తు ఐడీ, పుట్టినతేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో..

TS TET 2023 Hall Tickets: సెప్టెంబర్ 15న తెలంగాణ టెట్‌ పరీక్ష.. మొత్తం ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారంటే..
TS TET 2023
Srilakshmi C
|

Updated on: Sep 10, 2023 | 5:52 PM

Share

హైదరాబాద్, సెప్టెంబర్ 10:  తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2023 హాల్‌ టికెట్లు శనివారం (సెప్టెంబర్‌ 9) టెట్‌ కన్వీనర్, రాష్ట్ర విద్యా పరిశోధన & శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సంచాలకురాలు రాధారెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు దరఖాస్తు ఐడీ, పుట్టినతేదీ వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సెప్టెంబర్‌ 15వ తేదీన టెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. టెట్‌ పేపర్‌ 1 పరీక్షకు 1139 పరీక్ష కేంద్రాలు, పేపర్‌ 2 పరీక్షకు 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కన్వినర్ తన ప్రకటనలో పేర్కొంది.

కాగా టెట్‌ పరీక్షకు పేపర్‌ 1కు 2,69,557 మంది, పేపర్‌ 2కు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక రెండు పేపర్లకు కలిపి 1,86,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది టెట్‌ 2023 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,91,058 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష రాయడానికి హాల్‌టికెట్లను తాజాగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్ల వివరాల్లో తప్పులుంటే సంబంధిత పరీక్షా కేంద్రంలో సరిచేసుకోవచ్చన్నారు. అక్కడ నామినల్‌ రోల్స్‌ కమ్‌ ఫొటో ఐడెంటిటీలో వాటిని సరిచేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. అభ్యర్థులు సెప్టెంబరు 14వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏదైనా సమస్య ఎదురైతే హెల్ప్‌ డెస్క్‌ 040-23120340, 040-23120433 ఫోన్‌ నంబర్ల ఫోన్‌ చేయవచ్చని సూచించారు.

టెట్‌ నిర్వహణకు సంబంధించి ఎస్‌సీఈఆర్‌టీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 15వ తేదీన రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. పేపర్‌ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, పేపర్‌ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. టెట్‌ పరీక్ష అనంతరం ఫలితాలు కూడా ఇదే నెలలో అంటే సెప్టెంబరు 27న విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువు సొంతం చేసుకోవాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. అలాగే టెట్‌లో అర్హత సాధించిన వారే డీఎస్సీ రాయడానికి అర్హులు కూడా. డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్‌ వెయిటేజీ మార్కులు కీలకంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?