Sleep Precautions: ఒక మనిషి ఎన్ని గంటలు నిద్రపోతే మంచిదో తెలుసా? ఈ టిప్స్ మీకోసమే!

మనిషి జీవితంలో ఆహారం, నీరు మాత్రమే ముఖ్యమైనది కాదు. నిద్ర కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఒక రోజు తినకపోయినా పర్వాలేదు కానీ.. నిద్ర లేకపోతే మాత్రం మనిషి మనిషిలో ఉండడు. తలపోటు, వికారం, వాంతులు, డీ హైడ్రేషన్ కు గురవ్వడం, కళ్లు తిరగడం ఇలా ఎన్నో రకాల సమస్యలు తెలెత్తుతారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో సరైన నిద్ర ఉండదు. దీంతో తల్లలు ఏ సమయంలో పడుకుంటారో, ఏ సమయంలో లేస్తారో వాళ్లకే తెలీదు. దీంతో తొందరగా జబ్బుల బారి..

Sleep Precautions: ఒక మనిషి ఎన్ని గంటలు నిద్రపోతే మంచిదో తెలుసా? ఈ టిప్స్ మీకోసమే!
Sleeping
Follow us
Chinni Enni

|

Updated on: Sep 17, 2023 | 11:25 AM

మనిషి జీవితంలో ఆహారం, నీరు మాత్రమే ముఖ్యమైనది కాదు. నిద్ర కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఒక రోజు తినకపోయినా పర్వాలేదు కానీ.. నిద్ర లేకపోతే మాత్రం మనిషి మనిషిలో ఉండడు. తలపోటు, వికారం, వాంతులు, డీ హైడ్రేషన్ కు గురవ్వడం, కళ్లు తిరగడం ఇలా ఎన్నో రకాల సమస్యలు తెలెత్తుతారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో సరైన నిద్ర ఉండదు. దీంతో తల్లలు ఏ సమయంలో పడుకుంటారో, ఏ సమయంలో లేస్తారో వాళ్లకే తెలీదు. దీంతో తొందరగా జబ్బుల బారి పడుతున్నారు. నిద్ర సరిగ్గా లేకపోయినా.. ఇమ్యూనిటీ తక్కువ అయిపోతుంది. దీంతో ఏ పని మీద ధ్యాస పెట్టలేం.. చేయలేం కూడా.

అందరికీ ఒకటే వర్తించదు:

సాధారణంగా మనిషికి 8 గంటల నిద్ర అవసరం అని డాక్టర్లు చెబుతూంటారు. కానీ ఇది అందరికీ వర్తించదు. ఒక మనిషి శరీర తత్వం బట్టి, బరువు, వారు చేసే పనులు, ఆరోగ్య పరిస్థితి, వారి జీవన విధానం బట్టి ఉంటుంది. ఒకరికి 7 గంటల నిద్రమే సరిపోతుంది. మరికొందరికి 10 గంటల నిద్ర అవసరం. అసలు మీకో విషయం తెలుసా.. ఒక మనిష 11 రోజుల పాటు నిద్ర పోకుండా ఉంటే అతను మరణించే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు పని చేసే పని ఆధారంగా మీ స్లీపింగ్ విధానం పెరగడం లేదా తగ్గడం వంటివి ఉంటాయట. అయితే నిద్ర ఎక్కువగా పోయినా, తక్కువ అయినా పలు సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇది అనేక సమస్యలకు కారణం అవుంతని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

నిద్ర విషయంలో అలసత్వం పనికి రాదు:

నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలసత్వం పనికి రాదని సూచిస్తున్నారు. చాలా మంది నిద్ర పోయే సమయంలో సెల్ ఫోన్లు పట్టుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాగా ఈ విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు రాత్రి 7 లేదా 9 అయ్యిందంటే చాలు గాఢ నిద్రలోకి చేరుకునే వారు. కానీ ఇప్పుడు అర్థరాత్రి దాటినా కూడా నిద్ర పోవడం లేదు. ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితే దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే విపరీతంగా కాఫీలు, టీలు ఎక్కువగా తాగినా కూడా నిద్రపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండాలి. మరి ఎవరికి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరికి ఎన్ని గంటలు:

పెద్దలు – రోజూ రాత్రి 8 లేదా 7 గంటల నిద్ర సరిపోతుంది. వృద్ధులు – 8 నుంచి 9 గంటల నిద్ర అవసరం. యువకులు – 8 నుంచి 9 గంటలు కావాలి. పిల్లలు – 10 గంటలు ఖచ్చితంగా ఉండాలి. పసి బిడ్డలు – 11 నుంచి 14 గంటలు కావాలి. శిశువులు – 15 గంటలకు పైగానే ఉండాలి.

సరైన సమయంలో నిద్ర పోకపోతే అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దీంతో గుండె జబ్బులు, కాళ్లు, చేతులు లాగడం, కండరాల నొప్పులు, నరాల సమస్యలు, డయా బెటీస్, బీపీ, థైరాయిడ్ వంటి అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!