Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon for Pimples: పింపుల్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. నిమ్మ రసంతో బైబై చెప్పండి!

చర్మ సమస్యల్లో ఒకటి మొటిమలు. కేవలం ఆడవారికే కాకుండా, మగవారికి కూడా ఇవి ఎంతో చికాకును కలిగిస్తాయి. వీటితో అందం మొత్తం పోతుంది. చిరాకుగా అనిపిస్తాయి. ముఖంపై జిడ్డును కూడా ఏర్పరుస్తాయి ఈ మొటిమలు. ఇవి ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వాళ్లకు వస్తూంటాయి. అలాగే వాతావరణ మార్పులు, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ వల్ల కూడా వస్తాయి. కొన్ని రకాల పింపుల్స్ నొప్పి ఉండవు. కానీ కొన్ని రకాల మొటిమల వల్ల విపరీతమైన నొప్పి వస్తాయి. వీటిని తగ్గించడానికి ఎన్నో క్రీములు..

Lemon for Pimples: పింపుల్స్ తో ఇబ్బంది పడుతున్నారా.. నిమ్మ రసంతో బైబై చెప్పండి!
Lemon
Follow us
Chinni Enni

|

Updated on: Sep 17, 2023 | 1:04 PM

చర్మ సమస్యల్లో ఒకటి మొటిమలు. కేవలం ఆడవారికే కాకుండా, మగవారికి కూడా ఇవి ఎంతో చికాకును కలిగిస్తాయి. వీటితో అందం మొత్తం పోతుంది. చిరాకుగా అనిపిస్తాయి. ముఖంపై జిడ్డును కూడా ఏర్పరుస్తాయి ఈ మొటిమలు. ఇవి ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వాళ్లకు వస్తూంటాయి. అలాగే వాతావరణ మార్పులు, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ వల్ల కూడా వస్తాయి. కొన్ని రకాల పింపుల్స్ నొప్పి ఉండవు. కానీ కొన్ని రకాల మొటిమల వల్ల విపరీతమైన నొప్పి వస్తాయి. వీటిని తగ్గించడానికి ఎన్నో క్రీములు, ఫేస్ వాష్ లను వాడుతూ ఉంటారు. అయినా కొంత మందికి ఎలాంటి ఫలితాలు కనిపించవు. దీంతో చర్మ నిపుణుల వద్దకు పరుగులు పెడుతూంటారు.

అయితే ఇంట్లోని కొన్ని చిట్కాలతో కూడా పింపుల్స్ కు చెక్ పెట్టవచ్చు. మొటిమలను నియంత్రించడంలో నిమ్మ కాయ బాగా ఉపయోగ పడుతుంది. నిమ్మ రసాన్ని ఉపయోగించి పింపుల్స్ ని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే నిమ్మ రసాన్ని డైరెక్టుగా ముఖానికి అప్లై చేయకూడదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించుకోవాలి. దీని వల్ల చర్మం నల్లగా మారడమే కాకుండా, దురద వంటి వాటిని కలుగ చేస్తుంది. అలాగే కొంత మందికి నిమ్మ కాయ పడదు. అలాంటి వారు ఈ టిప్స్ కు దూరంగా ఉండటమే బెటర్.

నిమ్మ రసం – తేనె:

ఇవి కూడా చదవండి

ఓ చిన్న బౌల్ లోకి ఓ నాలుగైదు చుక్కల నిమ్మ రసాన్ని, ఓ రెండు, మూడు చుక్కలు తేనె తీసుకోవాలి. వీటి రెండింటిని బాగా కలుపుకోవాలి. కాటన్ సమాయంతో ఈ నిమ్మ రసం మిశ్రమాన్ని పింపుల్స్ పై అద్దుతూ ఉండాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వల్ల రిజల్ట్స్ కనిపిస్తాయి. అయితే మొదటి సారి రాసినప్పుడు మంట, దద్దర్లు వంటివి వస్తున్నాయో చూసుకోవాలి. అలాంటి లక్షణాలు కనిపిస్తే.. ఈ చిట్నాను పాటించకపోవడమే బెటర్.

నిమ్మ రసం – రోజ్ వాటర్:

ముఖాన్ని క్లీన్ చేయడంల నిమ్మ రసం, రోజ్ వాటర్ బాగా హెల్ప్ చేస్తాయి. ముందు ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఓ బౌల్ లోకి నాలుగైదు చుక్కల నిమ్మ రసాన్ని, మరో నాలుగు చుక్కల రోజ్ వాటర్ ని మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇది కూడా కాటన్ సహాయంతో మొటిమలపై రాయాలి. ఇలా ఓ పది నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే పింపుల్స్ సమస్య తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.