AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alzheimer’s: అల్జీమర్స్ వచ్చే సంకేతాలు ఇవే! చాలా జాగ్రత్తలు పాటించాలి!

సాధారణంగానే మనం ఒక్కోసారి ఏదైనా వస్తువులను మర్చిపోవడం కానీ, ఏమైనా పనులు చేయడం కానీ మర్చిపోతూంటాం. దీన్ని మతి మరుపు అంటారు. ఇలా ఏదో ఒక్కసారి అయితే పర్వాలేదు కానీ.. అదే కంటిన్యూ అయితే మీరు అల్జీ మర్స్ తో బాధ పడుతున్నట్లే. రోజు కాస్త జ్ఞాపక శక్తిని కోల్పోవడమే అల్జీ మర్స్ అంటారు. అల్జీమర్స్ అనేది మెదడుకు సంబంధించిన వ్యాధి. మతి మరుపు అంటే ఏదో హడావిడి సందర్భంలో అప్పుడప్పుడే జరుగుతూ ఉంటుంది. కానీ అల్జీ మర్స్ ముదిరితే మాత్రం....

Alzheimer's: అల్జీమర్స్ వచ్చే సంకేతాలు ఇవే! చాలా జాగ్రత్తలు పాటించాలి!
Alzheimer'
Chinni Enni
|

Updated on: Sep 17, 2023 | 3:07 PM

Share

సాధారణంగానే మనం ఒక్కోసారి ఏదైనా వస్తువులను మర్చిపోవడం కానీ, ఏమైనా పనులు చేయడం కానీ మర్చిపోతూంటాం. దీన్ని మతి మరుపు అంటారు. ఇలా ఏదో ఒక్కసారి అయితే పర్వాలేదు కానీ.. అదే కంటిన్యూ అయితే మీరు అల్జీ మర్స్ తో బాధ పడుతున్నట్లే. రోజు కాస్త జ్ఞాపక శక్తిని కోల్పోవడమే అల్జీ మర్స్ అంటారు. అల్జీమర్స్ అనేది మెదడుకు సంబంధించిన వ్యాధి. మతి మరుపు అంటే ఏదో హడావిడి సందర్భంలో అప్పుడప్పుడే జరుగుతూ ఉంటుంది. కానీ అల్జీ మర్స్ ముదిరితే మాత్రం.. మిమ్మల్ని మీరే మర్చిపోతారు. మీరు చేసే పనులు ఇలా ఏమీ గుర్తుండవు. అదే ఈ అల్జీమర్స్ ని ముందే గుర్తిస్తే కాస్త జాగ్రత్త పడవచ్చు. ఈ వ్యాధి వచ్చే ముందు మన శరీరంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే.. మనం అల్జీమర్స్ నుంచి బయట పడినట్లే.

– ఇటీవల తెలుసుకున్న సమాచారాన్ని మర్చిపోవడం. ముఖ్యమైన తేదీలలు మర్చిపోవడం. – మనం రోజూ చేసే పనులను కూడా గుర్తుకు ఉండవు. ఏకాగ్రత లేకపోవడం. – బయటకు వెళ్లే సమయంలో ఎక్కడికి వెళ్తున్నారో, దేని కోసం వెళ్తున్నారో గుర్తు లేకపోవడం – అయోమయానికి, గందర గోళానికి గురవ్వడం. – ఇంటి కిరాణా జాబితా సరిగ్గా గుర్తించులేక పోవడం. – ఎదురుగా ఉన్నా అక్షరాలను కూడా చదవలేక పోవడం. రాయడంలో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు. – వస్తువుల పేర్లు, ఒక్కోసారి మనుషులను కూడా గుర్తించలేక పోవడం. – ఒక వస్తువును ఎక్కడో పెట్టి మరో చోట వెతకడం. మొద్దు బారినట్టు ఉండటం. – రోజూ కనిపించిన వ్యక్తులు కొత్త వ్యక్తుల్లా కనిపిస్తారు. – రోజూ చేసే పనే.. గుర్తుండక పోవడం. మనకు ఏమి ఇష్టం, ఏం ఇష్టం లేదో కూడా గుర్తు లేకపోవడం.

ఇలాంటి లక్షణాలను ముందుగానే గుర్తిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు. లేదంటే అది తీవ్రమైన ప్రమాదానికి దారి తీస్తుంది. అలాగే మీకు ఈ మధ్య కాస్త మతి మరుపు ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తే వెంటనే.. మెదడును, జ్ఞాపక శక్తిని  పెంచే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల కూడా మతి మరుపును దూరం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో