Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghee Benefits: కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నారా.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే అంతా సెట్ అవుతుంది!

ప్రస్తుతం ఇప్పుడు అందర్నీ వేధిస్తోన్న మరో సమస్య కీళ్ల నొప్పులు. చాలా మంది ఈ కీళ్ల నొప్పులతోనే సతమతమవుతున్నారు. పాతికేళ్ల వయసు నుంచే ఈ కీళ్ల నొప్పులు వస్తున్నాయి. దానికి ముఖ్య కారణం. సరైన విధంగా కాల్షియం తీసుకోకపోవడం. ఇప్పుడు యువత ముఖ్యంగా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ మీదనే ఫోకస్ చేశారు. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం లేదు. ఈ కారణంతో చిన్న వయసులోనే రోగాల బారిన పడి.. ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఊబకాయం, బరువు..

Ghee Benefits: కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నారా.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే అంతా సెట్ అవుతుంది!
Ghee
Follow us
Chinni Enni

|

Updated on: Sep 24, 2023 | 5:58 PM

ప్రస్తుతం ఇప్పుడు అందర్నీ వేధిస్తోన్న మరో సమస్య కీళ్ల నొప్పులు. చాలా మంది ఈ కీళ్ల నొప్పులతోనే  ఇబ్బంది పడుతున్నారు. దానికి ముఖ్య కారణం. సరైన విధంగా కాల్షియం తీసుకోకపోవడం. ఇప్పుడు యువత ముఖ్యంగా జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ మీదనే ఫోకస్ చేశారు. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం లేదు. ఈ కారణంతో చిన్న వయసులోనే రోగాల బారిన పడి.. ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఊబకాయం, బరువు పెరగడం, జుట్టు నెరిసి పోవడం, చర్మంపై ముడతలు రావడం, డయాబెటీస్, బీపీ వంటి రోగాలు చుట్టుముట్టేస్తున్నాయి. మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తేనే.. ఈ రోగాలకు దూరంగా ఉండొచ్చు.

కీళ్ల నొప్పులు తగ్గించుకోవడంలో నెయ్యి మనకు చాలా హెల్ప్ చేస్తుంది. నెయ్యిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. దీన్ని సరైన మోతాదులో వాడితే మన శరీరానికి కావాల్సినవన్నీ దొరకుతాయి. నెయ్యిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మంచి కొవ్వులు ఉంటాయి. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచమే కాకుండా ఎముకలు, కీళ్లను గట్టి పడేలా చేస్తాయి. అలాగే శరీరంలో కణజాలాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇంకా నెయ్యితో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? నెయ్యిని ఎలా తీసుకుంటే లాభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నెయ్యిని ఎలా తీసుకోవాలంటే:

ఇవి కూడా చదవండి

ఉదయాన్నే పరగడుపున నెయ్యిని తీసుకుంటే.. ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చట. ఇలా తీసుకుంటే కీళ్ల నొప్పులతో పాటు, బరువు తగ్గేందుకు కూడా నెయ్యి హెల్ప్ చేస్తుందట. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయట.

2. ఎముకలు పుష్టిగా ఉంటాయి:

ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్లనే కాదు.. అప్పుడప్పుడు ఆహారంలో నెయ్యిని చేర్చుకున్నా కూడా ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయట. చాలా మంది ఇప్పుడు ఆర్థరైటీస్ తో బాధ పడుతున్నారు. ఇలాంటి వారు నెయ్యి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమంన పొందుతారు. అలాగే ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినడానికి ముందు స్త్రీలు.. ఒక స్పూన్  నెయ్యిని తీసుకుంటే కాల్షియం లోపం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

3. కళ్లకు మంచిది:

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకుంటే కళ్లకు చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఫోన్ చూడని, కంప్యూటర్ చూడని వారు ఎవరూ ఉండటం లేదు. ఇలాంటి వారికి కళ్లు ఒత్తిడికి గురై.. సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి నెయ్యి తీసుకోవడం వల్ల కళ్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి.

4. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది:

పరగడుపున నెయ్యి తీసుకుంటే జీర్ణ సమస్యలన్నీ పోతాయి. తిన్న ఆహారం కూడా చక్కగా జీర్ణం అవుతుంది. దీంతో కడుపు ఉబ్బరం, నొప్పి, గ్యాస్, మల బద్ధకం సమస్యలు ఉండవు. నెయ్యి ప్రేగుల  లోపల క్లీన్ చేస్తుంది.

5. టాక్సిన్స్ తొలగింపు:

ఉదయాన్నే పరగడుపున నెయ్యి తీసుకోవడం వల్ల.. శరీరంలో ఉండే టాక్సిన్స్, కొవ్వును బయటకు వెళ్తాయి. అలాగే గట్ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ ని 10-20 శాతం వరకు తగ్గిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.