దాదాపు అందరూ టీ, కాఫీలకు బానిసలు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వాటిని అతిగా తాగవద్దు. నిద్రపోయే ముందు టీ, కాఫీలు అస్సలు తీసుకోకూడదు. మద్యం సేవించడం వల్ల కూడా నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి రాత్రిపూట మద్యానికి దూరంగా ఉండాలి. మద్యపానానికి మాత్రమే కాకుండా, ధూమపానానికి కూడా దూరంగా ఉండటం మంచిది.