Star Fruit: స్టార్ ఫ్రూట్ ఆరోగ్యానికి మంచిదే.. అయితే వీరు తింటే మాత్రం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే..
ప్రస్తుత కాలంలో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. సమతుల్య, పోషకమైన ఆహారం తీసుకోవాలి. తినే ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు వంటివాటిని శరీరానికి అందించేలా ఉండాలి. అయితే ఎంత సూపర్ ఫుడ్ అయినప్పటికీ అతిగా తింటే ఏదైనా మంచికి బదులు శరీరాన్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. ముఖ్యంగా కొంతమంది కొన్ని రకాల ఆహారాన్ని, పండ్లను, కూరలను తీసుకోకూడదు. అలాంటి పండులో ఒకటి స్టార్ ఫ్రూట్. ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించినప్పటికీ.. దీనిని ఎక్కువగా తినేవారు కొన్ని విషయాలు తెలుసుకోవడం అతి ముఖ్యం.