- Telugu News Photo Gallery Salt Side Effects: Eating too much salt can cause these 5 diseases including high blood pressure
Salt Side Effects: అధిక ఉప్పు వినియోగంతో.. బీపీతో పాటు 5 రకాల ప్రాణాంతక వ్యాధుల ముప్పు
ఉప్పులేని కూర చప్పన.. అని వేమన అన్నాడు. చప్పనైనా పర్వాలేదు అధిక ఉప్పు తినకండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. ఏ వంటకం అయిన సరే ఉప్పు తగిన మోతాదులో మాత్రమే వేసుకోవాలంటున్నారు. నిజానికి.. శరీర సమతుల్యత, కండరాలు-నరాల పనితీరును నిర్వహించడానికి ఉప్పు అవసరం. ఉప్పు శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. కానీ ఉప్పు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఆహారంలో ఉప్పు పెరిగితే రక్తపోటు పెరిగి..
Updated on: Sep 24, 2023 | 11:07 AM

ఉప్పులేని కూర చప్పన.. అని వేమన అన్నాడు. చప్పనైనా పర్వాలేదు అధిక ఉప్పు తినకండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. ఏ వంటకం అయిన సరే ఉప్పు తగిన మోతాదులో మాత్రమే వేసుకోవాలంటున్నారు. నిజానికి.. శరీర సమతుల్యత, కండరాలు-నరాల పనితీరును నిర్వహించడానికి ఉప్పు అవసరం. ఉప్పు శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. కానీ ఉప్పు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం.

ఆహారంలో ఉప్పు పెరిగితే రక్తపోటు పెరిగి.. గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఉప్పులో సోడియం ఉంటుంది. శరీరంలో సోడియం స్థాయిలు పెరిగే కొద్దీ నీటిని నిలుపుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీంతొ అధిక రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, స్ట్రోక్, గుండె వైఫల్యం ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఆహారంలో ఉప్పును ఆచితూచి వేసుకోవాలి.

ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకుంటే, మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. కాలక్రమేణా, మూత్రపిండాల పనితీరు క్షీణించి, దెబ్బతింటాయి. ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. ఇది మీ చేతులు, పాదాలు, చీలమండలు, పాదాలలో వాపుకు కారణమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవాలి.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం విసర్జించబడుతుంది. ఫలితంగా శరీరంలో కాల్షియం స్థాయి తగ్గిపోతుంది. దీంతో ఎముకల సమస్యలు తలెత్తుతాయి. ఆర్థరైటిస్ ప్రారంభమవుతుంది.

ఓ సర్వే ప్రకారం.. భారతీయులు సగటున రోజుకు 10 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారట. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే 2 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలంటున్నారు.




