Lychee Side Effects: లిచీ అంటే ఇష్టమా.. ఎక్కువగా తింటున్నారా.. ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది..
బరువు తగ్గాలనుకునే వారికి లిచీ పండు చక్కటి ఆహారం. లిచీ పండ్లలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు, విటమిన్లు, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, మాంగనీస్ , కాపర్ వంటి ఖనిజాలున్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుండి మనలను రక్షించడంలో మేలు చేస్తాయి. అంతేకాదు జీర్ణశక్తిని పెంచుతుంది. లిచీ పండు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే, లిచీ పండును తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..