- Telugu News Photo Gallery Technology photos Lava launching budget 5g smart phone Lava blaze pro 5g on september 26th
Lava Blaze Pro 5G: భారత్‌లో లాంచింగ్‌కు సిద్ధమైన లావా కొత్త ఫోన్.. బడ్జెట్ ధరలో 5జీ
ప్రస్తుతం చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తోంది. మరీ ముఖ్యంగా 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజుకో కొత్త 5జీ హ్యాండ్ సెట్ మార్కెట్లో సందడి చేస్తోంది. ఇప్పటి వరకు చైనా ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తే తాజాగా భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం లావా సైతం 5జీ స్మార్ట్ ఫోన్‌ను సైతం తీసుకొచ్చే పనిలో పడింది. లావా బ్లేజ్ ప్రో 5జీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత ఉండనుంది.? ఇప్పుడు చూద్దాం..
Updated on: Sep 24, 2023 | 7:42 AM

దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. లావా బ్లేజ్ ప్రో పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకురానుంది. సెప్టెంబర్ 26వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

ఈనెల 26వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు యూట్యూబ్ వీడియో ద్వారా భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు లావా ఇది వరకే అధికారికంగా ప్రకటన చేసింది. బ్లాక్, ఆఫ్ వైట్ షేడ్స్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో రానుంది. ఇక ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నారు.

లావా బ్లేజ్ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్రోఫోన్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివటీ వంటి ఫీచర్స్‌ను అందించారు. ఇక ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్‌ఓసీ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

ఈ ఫోన్ ధరకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ రూ. 15 వేల లోపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఇక లావా గతేడాది లావా బ్లేబ్ ప్రో 4జీ పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో హెచ్‌డీ కర్వ్డ్ డిస్‌ప్లేను తీసుకొచ్చింది. దీంతో 5జీ ఫోన్‌లోనూ ఇలాంటి డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు సమాచారం.





























