- Telugu News Photo Gallery Technology photos One plus going to launch its foldable smartphone india check here for features and price
oneplus foldable: వన్‌ప్లస్ నుంచి కూడా ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఎలా ఉండనున్నాయంటే
ప్రస్తుతం మార్కెట్లో మడతపెట్టే ఫోన్స్ (ఫోల్డబుల్) హవా నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఇలాంటి ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థ వన్‌ప్లస్ సైతం ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసేందుకు వన్‌ప్లస్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..
Updated on: Sep 23, 2023 | 1:19 PM

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వన్‌ప్లస్ బ్రాండ్ తొలిసారి ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వన్‌ప్లస్ ఓపెన్ పేరుతో ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది.

ఇక ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ. నెట్టింట మాత్రం కొన్ని ఫీచర్లు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటి ఆధారంగా అసలు ఈ వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రాథమిక నివేదికల ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌వర్ట్ ఫోల్డింగ్ డిజైన్ ఉండనున్నట్లు అర్థమవుతోంది. టాప్ సెంటర్‌లో పంచ్ హోల్ కటౌట్, సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. అల్యూమీనియం ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ వంటి ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను అందించారు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 7.82 ఇంచెస్‌తో కూడి క్యూ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ మెయిన్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఇక అవుటర్ స్క్రీన్ విషయానికొస్తే 6.31 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇచ్చారు.

కెమెరా విషయానికొస్తే 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 48 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెండు మరో రెండు రెయిర్ కెమెరాలను ఇవ్వనున్నారు. 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.




