Memory Boosting: మీ పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫ్రూట్స్ ని పెట్టండి!
చాలా మంది పిల్లలకు జ్ఞాపక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. వారు ఎప్పుడూ ఆడుకోవడటానికే మక్కువ చూపిస్తారు. దీంతో చదువుపై కాన్సన్ ట్రేటషన్ తగ్గుతుంది. ఈక్రమంలో పిల్లలపై ఎక్కువగా టీచర్లు, పేరెంట్స్ ఒత్తిడి తీసుకొస్తారు. అయితే కొంత మంది పిల్లలు ఎంత చదవినా గుర్తుండదు. ఏకాగ్రత కూడా ఉండదు. దీంతో పిల్లల్ని తిడుతూ, కొడుతూ ఉంటారు. ఇలా చేస్తే వారిలో ఆత్మన్యూన్యతా భావం పెరిగిపోతుంది. దీంతో కొంత మంది పిల్లలు మొండిగా మారిపోతారు. మరికొంత మంది..
చాలా మంది పిల్లలకు జ్ఞాపక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. వారు ఎప్పుడూ ఆడుకోవడటానికే మక్కువ చూపిస్తారు. దీంతో చదువుపై కాన్సన్ ట్రేటషన్ తగ్గుతుంది. ఈక్రమంలో పిల్లలపై ఎక్కువగా టీచర్లు, పేరెంట్స్ ఒత్తిడి తీసుకొస్తారు. అయితే కొంత మంది పిల్లలు ఎంత చదవినా గుర్తుండదు. ఏకాగ్రత కూడా ఉండదు. దీంతో పిల్లల్ని తిడుతూ, కొడుతూ ఉంటారు. ఇలా చేస్తే వారిలో ఆత్మన్యూన్యతా భావం పెరిగిపోతుంది. దీంతో కొంత మంది పిల్లలు మొండిగా మారిపోతారు. మరికొంత మంది భయానికి లోనవుతారు. ఇలా చేయడం చాలా తప్పు. వారికి అర్థమయ్యే విధంగా చెప్తే పిల్లలు నేర్చుకుంటారు. వెంటనే రావంటే కష్టం.. మెల్ల మెల్లగా వారే నేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
అలాగే మీరు పెట్టే ఫుడ్స్ కూడా పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వారికి ఏవి పడితే అలాంటి ఫుడ్ పెట్టకూడదు. ముఖ్యంగా జంక్ ఫుడ్ ని వారికి చేరనివ్వకూడదు. అంతేకాకుండా పిల్లల్లో ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచే ఫుడ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా చాలా రకాల పండ్లలో జ్ఞాపక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి ఫుడ్ ని ఇవ్వడం వల్ల జ్ఞాపక శక్తి మాతమ్రే కాకుండా.. మెదడు అభివృద్ధి కూడా చెందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. అవేంటో ఓ లుక్ వేసేయండి.
దానిమ్మ కాయ:
దానిమ్మ రసం తీసుకుంటే జ్ఞాపక శక్తి, అభిజ్ఞా పనితీరును పెంచుతుందని పలు అధ్యనాలు చెబుతున్నాయి. ఎందుకంటే దీనిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
కివీ:
కివీలో కూడా విటమిన్ సి, కే వంటివి ఉంటాయి. ఇవి బ్రెయిన్ ని ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. కివీ తినడం వల్ల మెదడు కూడా చురుకుగా పని చేస్తుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.
బెర్రీస్:
అన్ని రకాల బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పని తీరును మెరుగుగా చేసి.. చురుకుగా ఉండేలా చేస్తాయి. బ్రెయిన్ ఆరోగ్యాన్ని కాపాడటంలో, జ్ఞాపక శక్తి పెంచడంలో బెర్రీస్ బాగా సహకరిస్తాయి. ఇవి మెదడులో ఆక్సీకరణ ఒత్తిడని తగ్గించడంలో హెల్ప్ అవుతాయి. అంతే కాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్లను, ఖనిజాలను అందిస్తాయి. స్కూల్ కి వెళ్లే పిల్లలకు బెర్రీస్ ని ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపక శక్తి మెరుగు పడుతుంది.
అరటి పండ్లు:
అరటి పండ్లలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండేలా చేయడంతో పాటు.. చురుకుగా ఉండేలా సహాయ పడతుంది.
యాపిల్స్:
యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థం అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఫలితంగా జ్ఞాపక శక్తి ప్రభావితం చేస్తుంది. ఫైబర్ రక్తంలోని షుగర్ లెవల్స్ ని నియంత్రిస్తుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అల్జీ మర్స్ వంటి సమస్యలు దరి చేరవు. అలాగే ఇవి జ్ఞాపక శక్తి, ఏకాగ్రతని పెంచేలా చేస్తాయి.
నట్స్:
రోజూ ఉదయాన్నే పిల్లలకు నానబెట్టిన నట్స్ ఇవ్వడం వల్ల పిల్లల బలంగా తయారవుతారు. వీటిలో కూడా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంతేకాకుండా నట్స్ డైలీ తినడం వల్ల పిల్లలు యాక్టీవ్ గా ఉంటారు. ఇవి తినడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.