- Telugu News Photo Gallery Cinema photos Meenakshi Chaudhary increasing craze in southindian film industry
Meenakshi Chaudhary: చాప కింద నీరులా దూసుకొస్తున్న మీనాక్షి చౌదరి
సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమా.. ఈ మాట ఇప్పుడు ఓ హీరోయిన్‌కు బాగా సూట్ అవుతుంది.. సూట్ అవ్వడం కాదు ఆమె కోసమే రాసినట్లుంది. వచ్చినపుడు ఎవరికీ తెలియదు.. రెండు మూడు సినిమాలు చేసాక కూడా పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు సౌత్‌లో తన రేంజ్ చూపిస్తుంది. మహేష్ బాబు టూ విజయ్ వరకు అందరితోనూ నటిస్తుంది. ఇంతకీ ఎవరా సైలెంట్ కిల్లర్..? నిజంగానే అట్టా మత్తెక్కించే కళ్లతో చూసి అందర్నీ పడేస్తున్నారు మీనాక్షి చౌదరి. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ..
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Oct 03, 2023 | 8:41 PM

సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమా.. ఈ మాట ఇప్పుడు ఓ హీరోయిన్‌కు బాగా సూట్ అవుతుంది.. సూట్ అవ్వడం కాదు ఆమె కోసమే రాసినట్లుంది. వచ్చినపుడు ఎవరికీ తెలియదు.. రెండు మూడు సినిమాలు చేసాక కూడా పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు సౌత్‌లో తన రేంజ్ చూపిస్తుంది. మహేష్ బాబు టూ విజయ్ వరకు అందరితోనూ నటిస్తుంది. ఇంతకీ ఎవరా సైలెంట్ కిల్లర్..?

నిజంగానే అట్టా మత్తెక్కించే కళ్లతో చూసి అందర్నీ పడేస్తున్నారు మీనాక్షి చౌదరి. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. వెంటనే రవితేజ ఖిలాడీలోనూ నటించారు. అయితే రెండూ ఫ్లాప్ అవ్వడంతో మీనాక్షిపై పెద్దగా చర్చ జరగలేదు. హిట్ 2 హిట్టైనా కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఈ బ్యూటీకి.

గ్లామర్ షోలో ఏ అడ్డు చెప్పదు మీనాక్షి చౌదరి. గుంటూరు కారంలో పూజా హెగ్డే తప్పుకోవడంతో మెయిన్ హీరోయిన్‌గా శ్రీలీలను ప్రమోట్ చేసి.. ఆ ప్లేస్‌కు మీనాక్షిని తీసుకున్నారు గురూజీ. దాంతో దెబ్బకు ఈమె జాతకం మారిపోయింది.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ రామ్ తళ్లూరి సినిమా, వరుణ్ తేజ్ మట్కా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు మీనాక్షి చౌదరి.

సౌత్‌లో శ్రీలీల తర్వాత ఆ రేంజ్ బిజీగా ఉన్న హీరోయిన్ మీనాక్షినే. తాజాగా ఈమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించబోయే సినిమాలో మీనాక్షిని హీరోయిన్‌గా ఎంపిక చేసారు మేకర్స్. దాంతో తమిళంలోనూ ఈ భామ పేరిప్పుడు మార్మోగిపోతుంది. మొత్తానికి చప్పుడు లేకుండా వచ్చి సైలెంట్ కిల్లర్‌గా మారిపోతున్నారు మీనాక్షి చౌదరి.





























