- Telugu News Photo Gallery Cinema photos How long will we have this medium range.. Heroes who say that we will also become stars..
Telugu Heroes: ఇంకెంతకాలం మాకు ఈ మీడియం రేంజ్.. మేం కూడా స్టార్స్ అవుతాం అంటున్న హీరోలు..
ఇంకెంతకాలం మాకు ఈ మీడియం రేంజ్ ట్యాగ్ లైన్.. మేం కూడా స్టార్స్ అనిపించుకోవాలి కదా అంటున్నారు మన టయర్ 2 హీరోలు. అందుకే ఖతర్నాక్ ప్లానింగ్‌తో ముందుకొస్తున్నారు. కొడితే కుంభస్థలమే అన్నట్లు.. నాని, విజయ్ దేవరకొండ టూ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వరకు అంతా ఒకే దారిలో వెళ్తున్నారు. మరి ఏంటా రూట్.. అసలు దేనికోసం వీళ్ళ ప్లానింగ్..? తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న హీరోలు అరడజన్ మందే ఉన్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్, ఎన్టీఆర్, పవన్, మహేష్ బాబు అందరికంటే ముందుంటారు ఈ లిస్టులో.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Oct 04, 2023 | 12:52 PM

ఇంకెంతకాలం మాకు ఈ మీడియం రేంజ్ ట్యాగ్ లైన్.. మేం కూడా స్టార్స్ అనిపించుకోవాలి కదా అంటున్నారు మన టయర్ 2 హీరోలు. అందుకే ఖతర్నాక్ ప్లానింగ్‌తో ముందుకొస్తున్నారు. కొడితే కుంభస్థలమే అన్నట్లు.. నాని, విజయ్ దేవరకొండ టూ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వరకు అంతా ఒకే దారిలో వెళ్తున్నారు. మరి ఏంటా రూట్.. అసలు దేనికోసం వీళ్ళ ప్లానింగ్..?

తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న హీరోలు అరడజన్ మందే ఉన్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్, ఎన్టీఆర్, పవన్, మహేష్ బాబు అందరికంటే ముందుంటారు ఈ లిస్టులో. సీనియర్లలో చిరు, బాలయ్య ముందున్నారు. వీళ్ళ తర్వాత విజయ్ దేవరకొండ, రవితేజ, నాని, నితిన్, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు మీడియం రేంజ్‌లో ఉన్నారు.

పాన్ ఇండియన్ సినిమాల హవా మొదలైన తర్వాత హీరోల రేంజ్ పెరిగిపోయింది. అందుకే తమ మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు మీడియం రేంజ్ హీరోలు. దీనికోసమే ఖతర్నాక్ ప్లాన్ చేస్తున్నారు. అదే బడ్జెట్ మంత్రం.. తమ మార్కెట్‌కు మించి బడ్జెట్‌తో సినిమాలు చేస్తున్నారు. నాని దసరా.. విజయ్ దేవరకొండ లైగర్.. రవితేజ టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలే దీనికి నిదర్శనం.

హిట్టు ఫ్లాప్ పక్కనబెడితే ముందు బడ్జెట్ పెరిగితే.. హీరో రేంజ్ కూడా పెరుగుతుంది. కావాలంటే నానినే తీసుకోండి.. దసరాకు ముందు ఒక్కసారి కూడా 40 కోట్ల మార్క్ అందుకోని నాని.. ఈ సినిమాతో ఏకంగా 65 కోట్లు షేర్.. 110 కోట్ల గ్రాస్ వసూలు చేసారు. అలాగే లైగర్ ఫ్లాప్ అయినా.. ఫస్ట్ డేనే 34 కోట్లు వసూలు చేసింది. బడ్జెట్ పెరిగితే.. మార్కెట్ కూడా పెరుగుతుంది.

వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా నాన్ థియెట్రికల్ రైట్సే 50 కోట్లకు అమ్మాడయ్యాయి. దానికి కారణం ఆ సినిమా గ్రాండియరే. అలాగే ఏజెంట్ తర్వాత అఖిల్ మరోసారి భారీ బడ్జెట్ సినిమానే చేయబోతున్నారు. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది సినిమా సైతం 50 కోట్ల రేంజ్‌లోనే రాబోతుంది. మొత్తానికి తెలివిగా మార్కెట్ పెంచుకుంటున్నార మన హీరోలు.





























