Tilak Varma: ‘అమ్మకు మాటిచ్చా’.. ట్యూటూ చూపిస్తూ సంబరాలు చేసుకోవడంపై తెలుగు తేజం తిలక్‌ వర్మ.. వీడియో

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ఏకపక్షంగా బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తిలక్ హాఫ్ సెంచరీతో అదరగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా అర్ధసెంచరీ అనంతరం తిలక్ వర్మ సెలబ్రేషన్స్‌ చేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Tilak Varma: 'అమ్మకు మాటిచ్చా'.. ట్యూటూ చూపిస్తూ సంబరాలు చేసుకోవడంపై తెలుగు తేజం తిలక్‌ వర్మ.. వీడియో
Tilak Varma
Follow us
Basha Shek

|

Updated on: Oct 07, 2023 | 6:15 AM

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ ఏకపక్షంగా బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తిలక్ హాఫ్ సెంచరీతో అదరగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా అర్ధసెంచరీ అనంతరం తిలక్ వర్మ సెలబ్రేషన్స్‌ చేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్‌ను భారత స్పిన్నర్లు పెద్దగా స్కోర్ చేయనివ్వలేదు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని టీమిండియా 9.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి సాధించింది. ఈ మ్యాచ్‌లో తిలక్ 55 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ 50 పరుగులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. 50 పరుగులు పూర్తి చేసిన తర్వాత తన టీ-షర్ట్ పైకెత్తి తన ఒంటిపై నున్న ట్యాటూను చూపించాడు తిలక్‌. ఇంతకీ ఆ పచ్చబొట్టు మరెవరిదో కాదు.. తన అమ్మానాన్నలదే. మ్యాచ్ అనంతరం దీని గురించి మాట్లాడిన తెలుగు తేజం.. తన తల్లికి ఇచ్చిన మాట కోసం అలా సంబరాలు చేసుకున్నానన్నాడు. అంతేకాదు ఈ హాఫ్ సెంచరీ తన తల్లితో పాటు రోహిత్ శర్మ కూతురు సమైరాకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు.

‘ఈ సెలెబ్రేషన్స్ మా అమ్మ కోసం. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్‌ల్లో నేను చెప్పుకోదగిన రీతిలో రాణించలేకపోయా. దీంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. ఈ సారి అర్ధ సెంచరీ కొడితే నా శరీరంపై ఉన్న ట్యూటూను చూపిస్తూ సంబరాలు చేసుకుంటానని మా అమ్మకు మాట ఇచ్చాను. అందుకే ఇలా చేశాను. మా అమ్మతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్ సమైరాకు ఈ హాఫ్ సెంచరీ అంకితం’ అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తిలక్‌ వర్మను ప్రశంసిస్తూ నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు తిలక్‌. కేవలం 26 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 55 పరుగులతో భారత్‌ కు పతకం ఖాయం చేశాడు. ఇక కెప్టెన్ గైక్వాడ్ 26 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో అజేయంగా 40 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

తిలక్ వర్మ సెలబ్రేషన్స్ .. వీడియో..

View this post on Instagram

A post shared by Tilak Varma (@tilakvarma9)

వారికే ఈ అర్థసెంచరీ అంకితం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
ఈ వీడియో చూస్తే అస్సలు నవ్వు ఆపుకోలేరు.! పాముతోనే ఆటల..
ఈ వీడియో చూస్తే అస్సలు నవ్వు ఆపుకోలేరు.! పాముతోనే ఆటల..
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం