PAK vs NED Match Report: బౌలర్ల పోరులో గెలిచిన పాక్.. చిత్తుగా ఓడిన నెదర్లాండ్స్.. విజయంతో బాబర్ సేన ప్రయాణం షురూ..
ICC World Cup Match Report, Pakistan vs Netherlands: వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పాక్ జట్టు 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. అనంతరం డచ్ జట్టు 41 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బాబర్ సేన 81 పరుగులతో తొలి విజయం సాధించింది.
PAK vs NED Match Report: వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పాక్ జట్టు 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. అనంతరం డచ్ జట్టు 41 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బాబర్ సేన 81 పరుగులతో తొలి విజయం సాధించింది.
భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు తొలిసారి విజయం సాధించింది. అంతకుముందు, 1996, 2011లో పాక్జ ట్టు భారతదేశంలో 2 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడింది. రెండింటిలోనూ తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది.
ఆల్ రౌండర్ బాస్ డి లీడ్ డేంజరస్ బౌలింగ్, అద్భుతమైన బ్యాటింగ్ ఉన్నప్పటికీ, నెదర్లాండ్స్ 2023 వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. తొలుత ఆడిన పాకిస్థాన్ జట్టు తరపున మహ్మద్ రిజ్వాన్ (68), సౌద్ షకీల్ (68) అర్ధ సెంచరీలతో 286 పరుగులు చేసింది. కాగా, నెదర్లాండ్స్ బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసిన బాస్ డి లీడ్ అనంతరం బ్యాటింగ్‌లోనూ 67 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతను తన జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. అతడితో పాటు ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు.
మిగతా బ్యాటర్లలో తేజ నిడమనూరు 05, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 00, సాకిబ్ జుల్ఫికర్ 10, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే 04 పరుగుల వద్ద ఔటయ్యారు. 120 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోవడంతో నెదర్లాండ్స్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 133 పరుగులుగా మారింది. హారీస్ రవూఫ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే, బాస్ డి లీడ్ ఒక ఎండ్ నుంచి పరుగులు చేస్తూనే ఉన్నాడు. 68 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. చివర్లో లోగాన్ వాన్ బీక్ 28 పరుగులతో నాటౌట్ గా వెనుదిరిగాడు. ఇందులో 3 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు.
View this post on Instagram
పాకిస్థాన్ తరపున హరీస్ రవూఫ్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు హసన్ అలీకి రెండు వికెట్లు దక్కాయి. కాగా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఇఫ్తికార్ అహ్మద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
రెండు జట్ల ప్లేయింగ్ 11..
పాకిస్థాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ.
నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), విక్రమజీత్ సింగ్, మాక్స్ ఓ’డౌడ్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్, ఆర్యన్ దత్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..