AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ‘ప్రత్యేక అభిమానిని’ కలుసుకున్న విరాట్ కోహ్లి.. గుండెలను పిండేసే వీడియో షేర్ చేసిన బీసీసీఐ..

ప్రపంచ కప్ కోసం భారత జట్టు కొత్త శిక్షణా కిట్‌ను పొందింది. అక్టోబరు 5న, భారత ఆటగాళ్లు ఆరెంజ్ జెర్సీలో మూడు గంటలపాటు తీవ్రమైన ప్రాక్టీస్ చేశారు. జట్టు మొత్తం ప్రాక్టీస్‌లో లీనమైంది. ఈ సమయంలో భారత క్రికెట్ జట్టును చూసేందుకు ఓ వికలాంగ అభిమాని టిక్కెట్ కొనడానికి స్టేడియంకు చేరుకున్నాడు. ఈ అభిమాని విరాట్ కోహ్లి చిత్రాన్ని కూడా తన చేతితో గీసి, స్టేడియానికి తీసుకొచ్చాడు. అది అతనికి 40 గంటల కంటే ఎక్కువ సమయం పట్టిందంట.

Video: 'ప్రత్యేక అభిమానిని' కలుసుకున్న విరాట్ కోహ్లి.. గుండెలను పిండేసే వీడియో షేర్ చేసిన బీసీసీఐ..
Virat Kohli Fan
Venkata Chari
|

Updated on: Oct 06, 2023 | 9:05 PM

Share

CWC 2023: ఈ ప్రపంచ కప్ (ICC Cricket World Cup 2023)లో విరాట్ కోహ్లీపై భారత జట్టుతోపాటు అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈసారి కింగ్ కోహ్లీ (Virat Kohli) తన వన్డే కెరీర్‌లో నాలుగో ప్రపంచకప్‌ను ఆడుతున్నాడు. టోర్నీ కోసం కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. టీమ్ ఇండియా (Team India) తొలి మ్యాచ్ ఆదివారం ఆస్ట్రేలియాతో (IND vs AUS) జరగనుంది. దీని కోసం ఇరు జట్లు చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇంతలో, కోహ్లీ మ్యాచ్ ఆడకుండానే తన ప్రత్యేక అభిమానులలో ఒకరి హృదయాన్ని గెలుచుకున్నాడు.

ప్రపంచ కప్ కోసం భారత జట్టు కొత్త శిక్షణా కిట్‌ను పొందింది. అక్టోబరు 5న, భారత ఆటగాళ్లు ఆరెంజ్ జెర్సీలో మూడు గంటలపాటు తీవ్రమైన ప్రాక్టీస్ చేశారు. జట్టు మొత్తం ప్రాక్టీస్‌లో లీనమైంది. ఈ సమయంలో భారత క్రికెట్ జట్టును చూసేందుకు ఓ వికలాంగ అభిమాని టిక్కెట్ కొనడానికి స్టేడియంకు చేరుకున్నాడు. ఈ అభిమాని విరాట్ కోహ్లి చిత్రాన్ని కూడా తన చేతితో గీసి, స్టేడియానికి తీసుకొచ్చాడు. అది అతనికి 40 గంటల కంటే ఎక్కువ సమయం పట్టిందంట. కోహ్లితో పాటు టీమిండియా ఆటగాళ్లు కూడా ఈ అభిమానిని కలుసుకుని ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

చెన్నైలో చిరస్మరణీయమైన రోజును గడిపిన విరాట్ కోహ్లీ ప్రత్యేక అభిమాని శ్రీనివాస్‌ వీడియో..

కోహ్లి కవర్ డ్రైవ్ నన్ను అభిమానిని చేసింది – శ్రీనివాస్

వీడియోలోని ఇంటర్వ్యూలో, శ్రీనివాస్ అనే అభిమాని మాట్లాడుతూ, నేను ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం టిక్కెట్లు కొనడానికి వచ్చాను. అయితే, నేను విరాట్ కోహ్లీని కలిశాను. 40 గంటల సమయం పట్టిన ఈ చిత్రాన్ని నా చేతులతో రూపొందించాను. కోహ్లీ నా దగ్గరకు వచ్చి దీనిపై నా ఆటోగ్రాఫ్ కావాలా అని అడిగాడు. తను ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. నేను తరతో ఫొటోలు కూడా తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

‘తను మైదానంలో దూకుడుగా ఉంటాడు. కానీ, మైదానం వెలుపల అతను చాలా దయగల, మంచి వ్యక్తి. ఆయన కవర్ డ్రైవ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన ఫ్యాన్ అయ్యాను. మేం అభిమానులు బహుశా జట్టుపై ఒత్తిడి తెస్తాం. కానీ, అది వారి పట్ల మనకున్న ప్రేమ మాత్రమే. మొత్తం జట్టుకు శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..