Bigg Boss Shivaji: ఆసక్తికర వెబ్‌ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్న బిగ్‌బాస్‌ శివాజీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

2016 తర్వాత సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించని శివాజీ చాలా లాంగ్‌ గ్యాప్‌ తర్వాత బిగ్‌బాస్‌ షోతో మన ముందుకు వచ్చాడు. ఏడో సీజన్‌లో టాప్‌ కంటెస్టెంట్‌గా మెప్పిస్తున్నాడు. తనదైన ఆటతీరు, మాటలతో ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు. ఇక హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌తోనూ సఖ్యతగా ఉంటూ బిగ్‌బాస్‌ పెద్దన్నగా మారిపోయాడు. ఇదిలా ఉంటే నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు శివాజీ. నైంటీస్ అనే వెబ్‌సిరీస్‌తో సుమారు ఏడేళ్ల త‌ర్వాత తెలుగు ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

Bigg Boss Shivaji: ఆసక్తికర వెబ్‌ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్న బిగ్‌బాస్‌ శివాజీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Bigg Boss Shivaji
Follow us
Basha Shek

|

Updated on: Oct 07, 2023 | 6:05 AM

ఒక చిన్న క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు శివాజీ. ఆతర్వాత హీరోగా నిలదొక్కుకుని పలు హిట్‌ సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా కామెడీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయాడు. మిస్స‌మ్మ‌, మంత్ర‌, అమ్మాయి బాగుంది, శ్రీరామచంద్రులు, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం, సత్యాభామ, నీ నవ్వే చాలు, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, తాజ్‌ మహల్‌, కమలతో నా ప్రయాణం తదితర హిట్ సినిమాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించాడు శివాజీ. అయితే ఉన్నట్లుండి హఠాత్తుగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మధ్యలో రాజకీయాలతోనూ వార్తల్లో నిలిచాడు. 2016 తర్వాత సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించని శివాజీ చాలా లాంగ్‌ గ్యాప్‌ తర్వాత బిగ్‌బాస్‌ షోతో మన ముందుకు వచ్చాడు. ఏడో సీజన్‌లో టాప్‌ కంటెస్టెంట్‌గా మెప్పిస్తున్నాడు. తనదైన ఆటతీరు, మాటలతో ఆడియెన్స్‌ను అలరిస్తున్నాడు. ఇక హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌తోనూ సఖ్యతగా ఉంటూ బిగ్‌బాస్‌ పెద్దన్నగా మారిపోయాడు. ఇదిలా ఉంటే నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు శివాజీ. నైంటీస్ అనే వెబ్‌సిరీస్‌తో సుమారు ఏడేళ్ల త‌ర్వాత తెలుగు ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

త్వరలోనే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

తాజాగా నైంటీస్‌ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి శివాజీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజైంది. ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్ అనేది ఈ సిరీస్‌ క్యాప్షన్‌. ఇందులో మ్యాథ్స్‌ టీచర్‌ చంద్రశేఖర్‌ అనే పాత్రలో కనిపించనున్నాడీ యాక్టర్‌. వనపర్తి అనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందనుందని తెలుస్తుంది. ఈ వెబ్‌ సిరీస్‌కు ఆదిత్య హ‌స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో త్వరలోనే  ఈ నైంటీస్‌ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్‌ డేట్‌ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అలాగే ఇతర నటీనటులు, టెక్నీషియన్ల గురించి త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

నైంటీస్ వెబ్ సిరీస్ లో శివాజీ లుక్..

View this post on Instagram

A post shared by ETV Win (@etvwin)

బిగ్ బాస్ లో నటుడు శివాజీ..

బిగ్ బాస్ ఏడో సీజన్  స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా  శివాజీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!