Bigg Boss Season 7: వేటాడిన రైతు బిడ్డ..! ఒక్కొక్కడిని సంగతి తేల్చి మరీ.. బిగ్ బాస్ కెప్టెన్ కుర్చీ ఎక్కిన కామన్ మ్యాన్..
రసవత్తరంగా సాగే ఓ గేమ్‌లో మనకు నచ్చిన వాడే గెలవాలని అనుకుంటాం.. వైస్ వర్సా.. మనకు నచ్చని వాడు ఓడిపోవాలని కూడా బలంగా కోరుకుంటాం..! కానీ మన ఊహకు అతీతంగా.. కిక్కిచ్చే విధంగా.. మన మైండ్‌లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ లేని వాడు గెలిస్తే ఎలా ఉంటుంది. షాకింగ్ గానే కాదు.. మైండ్ బ్లో అయ్యే విధంగా ఉంటుంది కదూ.. ! తాజాగా జరిగిన బిబీ 7 కెప్టెన్సీ టాస్క్‌లోనూ ఇదే జరిగింది.
ఇక ఇవ్వాల కూడా.. ‘చిట్టి ఆయీరే’ టాస్క్‌తో మొదలైన బిగ్ బాస్ కాస్త డ్రామా.. మరి కాస్త ఓవర్ యాక్షన్ మధ్య సాగుతూ ఎందుకో అందర్నీ ఇరిటేట్ చేస్తుంది. సందీప్, అమర్ దీప్‌తో మొదలైన ఈ టాస్క్‌లో.. అమర్ లెటర్‌ను సాక్రిఫైస్ చేశాడన్న పేరు కానీ.. తన ఎమోషన్స్‌తో.. తన మాటలతో.. ఎందుకో చూసే వారిని ఇరిటేట్ చేస్తారు. ఇక సందీప్ కూడా.. అమర్‌కు తీసిపోని విధంగా.. అదే రేంజ్‌లో డ్రామా ప్లే చేస్తారు.
ఇక ఆ తరువాత వచ్చిన శివాజీకి.. మాంచి కాఫీ అందించిన బిగ్ బాస్.. శివాజీని ఎమోషనల్ అయ్యేలా చేస్తాడు. ఆ తరువాత ఎమోషనల్ డ్యామేజ్ వద్దనుకున్న శివాజీ.. ప్రశాంత్ ను కెప్టెన్సీ కంటెండర్‌గా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటాడు. ఆడు.. దున్ను.. కానీ నీ లైన్లో అంటూ.. గివప్ ఇస్తాడు శివాజీ. ఇక శివాజీ మాటలకు ప్రశాంతో ఎమోషనల్ అవుతాడు. శివాజీని పట్టకుని ఏడుస్తాడు.
33వ రోజు.. ఉదయం 10 గంటలకు సందీప్‌తో మాట్లాడిన శోభ.. తేజ కు కాకుండా.. తనకే సపోర్ట్ చేస్తా అంటుంది. కానీ సందీప్ వెళ్లగానే.. సందీప్ గేమ్ ప్లాన్ ను తిట్టుడుతుంది. ఇంకో పక్క గౌతమ్, సుబ్బు సాక్రిఫైజ్ గురించే మాట్లడుకోవడం షురూ అవుతుంది. ఇక ఆ తరువాత జరిగిన సెంచురీ మ్యాట్రస్ టాస్క్‌లో ప్రియాంక గెలుస్తుంది.
ఇక ఎగ్జీక్టీ రాత్రి 7 గంటలకు అన్‌లైన్లోకి వచ్చిన బిగ్ బాస్.. కెప్టెన్సీ కంటెస్టెంట్స్ ముందు మరో టాస్క్ పెడతాడు. కెప్టెన్సీ టాస్క్ కోసం క్వాలిఫై అయిన నలుగురు కంటెండర్స్.. మధ్యలో రంగు పడుద్ది అనే గేమ్ పెడతాడు. ఈ గేమ్ లో భాగంగా.. ఎవరి టీషర్ట్ పై ఎక్కువ రంగు ఉంటుందో వాళ్లు ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ అంటూ.. చెబుతాడు బిగ్ బాస్. అలా చివరి వరకు తక్కువ రంగు ఉన్న కంటెండర్ బిగ్ బాస్ ఫస్ట్ క్యాప్టెన్ అవుతాడంటూ.. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఈ టాస్క్ కు సంచాలకుడిగా..ప్రియాంక వ్యవహరిస్తాడంటూ చెబుతాడు బిగ్ బాస్.
ప్రశాంత్ యావర్, సందీప్, తేజ, గౌతమ్ ఈ నలుగురి మధ్య మొదలైన ఈ టాస్క్ చాలా రసవత్తరంగా సాగుతుంది. ఇక టాస్క్ మధ్యలో.. ప్రశాంత్, సందీప్ తేజను రెడ్ లైన్ బయటికి తోయగా.. తేజ గేమ్ నుంచి అవుట్ అంటూ.. మొదట నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈ తరువాత.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. గేమ్‌లో ఎవరి టీషర్ట్ మీద ఎక్కువ రంగు ఉందో.. వాళ్లని గేమ్ నుంచి బయటికి తీసుకు రావాలని డిసైడ్ అవుతారు. అకార్డింగ్ టూ ప్రియాంక ఎక్కువ రంగు సందీప్ టీషర్ట్ మీద ఉండడంతో.. సందీప్‌ను గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తుంది ప్రియాంక.
ఇక ఈక్రమంలో మళ్లీ అమర్, శివాజీ మధ్య వార్ షురూ అవుతుంది. శివాజీ ఒక్క ప్రశాంత్‌కే సపోర్ట్ చేస్తున్నాడని అమర్.. అదేం లేదురా అని శివాజీ ఇద్దరి మధ్య వాదన ఓ రేంజ్‌లో సాగుతుంది.
చాలా డిస్కషన్ తరువాత.. సందీప్, గౌతమ్ మధ్య వాడీ వేడీగా సాగిన గొడవ తరువాత.. ప్రియాంక తేజనే గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తుంది. ఆ తరువాత గౌతమ్, సందీప్, ప్రశాంత్ మధ్య సాగిన గేమ్‌లో.. సందీప్ రెడ్ లైన్ నుంచి బయటికి రావడంతో.. ఎలిమినేట్ అయినట్టు ప్రియాంక అనౌన్స్ చేస్తుంది.
ఇక ఆ తరువాత గౌతమ్ , ప్రశాంత్ మధ్య సాగిన టాస్క్‌లో.. ఎన్నో ఎమోషన్స్ అండ్.. డ్రామాస్ మధ్య పల్లవి ప్రశాంత్ గేమ్ విన్నర్ అని ప్రియాంక అనౌన్స్ చేస్తుంది. దీంతో తెలియని హౌ బిగ్ బాస్ చూస్తున్న ఆడియెన్స్‌లో కలుగుతుంది. ఇక ఆ తరువాత మళ్లీ లైన్లోకి వచ్చిన బిగ్ బాస్.. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ అని అనౌన్స్ చేస్తాడు. సందీప్‌ను స్టోర్ రూమ్ నుంచి బ్యాట్చ్ తెచ్చి ధరింపజేయాలని చెబుతాడు.
– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)
మరిన్ని బిగ్‌బాస్-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి