Bigg Boss 7 Telugu: అల్లాడించేసిన రైతు బిడ్డ.. రగిలిపోయిన సందీప్, అమర్ దీప్.. కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్..
ప్రిన్స్.. తేజ, శుభ శ్రీ.. గౌతమ్, శివాజీ.. ప్రశాంత్, అమర్ దీప్.. సందీప్ లకు తమ ఇళ్ల దగ్గరి నుంచి లెటర్స్ వచ్చాయి. వాటిలో జంటలో ఒకరికి మాత్రమే లెటర్ చదివే అవకాశం ఉంటుందని మిగిలిన వ్యక్తి త్యాగంం చేయాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్లు లెటర్ తోపాటు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని చెప్పారు బిగ్‌బాస్. అయితే ఇందులో ప్రశాంత్ కోసం శివాజీ త్యాగం చేయగా.. గౌతమ్ కోసం శుభ శ్రీ త్యాగం చేసి కెప్టెన్సీ పోటీ నుంచి తప్పుకున్నారు.
బిగ్‌బాస్ ఐదోవారంలో కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్నారు కంటెస్టెంట్స్. నిన్నటి ఎపిసోడ్లో ఇంటి సభ్యుల ఎమోషన్స్‌తో ఆడుకున్న సంగతి తెలిసిందే. చిట్టీ యాయీరే అనే టాస్క్ ఇచ్చి ఇంటి సభ్యులను ఏడిపించాడు. ప్రిన్స్.. తేజ, శుభ శ్రీ.. గౌతమ్, శివాజీ.. ప్రశాంత్, అమర్ దీప్.. సందీప్ లకు తమ ఇళ్ల దగ్గరి నుంచి లెటర్స్ వచ్చాయి. వాటిలో జంటలో ఒకరికి మాత్రమే లెటర్ చదివే అవకాశం ఉంటుందని మిగిలిన వ్యక్తి త్యాగంం చేయాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్లు లెటర్ తోపాటు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని చెప్పారు బిగ్‌బాస్. అయితే ఇందులో ప్రశాంత్ కోసం శివాజీ త్యాగం చేయగా.. గౌతమ్ కోసం శుభ శ్రీ త్యాగం చేసి కెప్టెన్సీ పోటీ నుంచి తప్పుకున్నారు.
ఇక తాజా కోసం యావర్ త్యాగం చేయగా.. సందీప్ కోసం అమర్ దీప్ లెటర్ వదలుకుని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్, తేజా, గౌతమ్, సందీప్ కెప్టెన్సీ పోటీలో నిలిచారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో వీరి నలుగురి మధ్య మరో టాస్క్ ఆడించారు బిగ్‌బాస్. మొదటి కెప్టెన్ అయ్యేందుకు రంగు పడుద్ది రాజా అనే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్.
View this post on Instagram
అందులో ఒక్కో కంటెస్టెంట్ టీషర్ట్ పై వేరే అపోనెంట్ రంగు పడకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆఖరి బజర్ మోగేసరికి ఎవరి టీషర్ట్ పై తక్కువ పెయింట్ ఉంటుందో అతనే బిగ్‌బాస్ మొదటి వారం ఫస్ట్ కెప్టెన్ అవుతారని చెప్పారు బిగ్‌బాస్. ఇక టాస్క్ మొదలవ్వగానే.. సందీప్ టీషర్ట్ లాగాడని అమర్ దీప్ అరవగా.. ముఖంపై ప్రశాంత్ కొట్టాడని వాదించాడు సందీప్. దీంతో నువ్వు కొట్టిన తర్వాతే నేను కొట్టానంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. ఇక రౌండ్ నుంచి బయటకు రావడంతో సందీప్ రేసు నుంచి తప్పుకున్నాడని అనౌన్స్ చేసింది సంచాలక్ ప్రియాంక. దీంతో ప్రియంకతో వాదిస్తూ నన్ను తోశారని.. నన్ను కొడితే తాట తీస్తానంటూ రెచ్చిపోయాడు సందీప్. ఇక చివరగా గౌతమ్, ప్రశాంత్ మధ్య పోటీ నడిచింది. వీరిద్దరిలో ఎవరు గెలిచారు ?.. ఎవరు మొదటి కెప్టెన్ అయ్యారు అనేది ఎపిసోడ్ లో తెలియనుంది.