Brahmamudi, October 6th episode: దుగ్గిరాల ఫ్యామిలీలో సందడి.. స్వప్న కన్నింగ్ ప్లాన్.. కావ్యకు తెలిసిపోయిన నిజం!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో దుగ్గిరాల ఫ్యామిలీలో వినాయక చవితి సందర్భంగా సందడి నెలకొంది. ఒకరి తర్వాత మరొకరు డాన్స్ చేస్తూ అలరించారు. ముందు అనామిక, కళ్యాణ్ లు డ్యాన్ చేశారు. వాళ్లిద్దరి డ్యాన్స్ చూసిన అప్పు.. అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ నెక్ట్స్ రుద్రాణి డ్యాన్స్ చేసి అదరగొడుతుంది. ఆ తర్వాత ధాన్య లక్ష్మి, ప్రకాష్ లు, కనకం, కృష్ణమూర్తిలు, ఇందిరా దేవి, సీతా రామయ్య డాన్స్ చేసి అలరిస్తారు. ఇక ఆ తర్వాత మన సీరియల్ హీరో రాజ్, హీరోయిన్..

Brahmamudi, October 6th episode: దుగ్గిరాల ఫ్యామిలీలో సందడి.. స్వప్న కన్నింగ్ ప్లాన్.. కావ్యకు తెలిసిపోయిన నిజం!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Oct 07, 2023 | 11:35 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో దుగ్గిరాల ఫ్యామిలీలో వినాయక చవితి సందర్భంగా సందడి నెలకొంది. ఒకరి తర్వాత మరొకరు డాన్స్ చేస్తూ అలరించారు. ముందు అనామిక, కళ్యాణ్ లు డ్యాన్ చేశారు. వాళ్లిద్దరి డ్యాన్స్ చూసిన అప్పు.. అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ నెక్ట్స్ రుద్రాణి డ్యాన్స్ చేసి అదరగొడుతుంది. ఆ తర్వాత ధాన్య లక్ష్మి, ప్రకాష్ లు, కనకం, కృష్ణమూర్తిలు, ఇందిరా దేవి, సీతా రామయ్య డాన్స్ చేసి అలరిస్తారు. ఇక ఆ తర్వాత మన సీరియల్ హీరో రాజ్, హీరోయిన్ కావ్యలు కూడా డ్యాన్స్ చేసి అదరగొడతారు. నెక్ట్స్ రాజ్, కళ్యాణ్, రాహుల్ లు ముగ్గురూ కలిసి డాన్స్ చేయగా.. స్వప్న, అనామిక, కావ్యలు కూడా కలిసి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరూ డ్యాన్స్ చేస్తూ దుమ్ము లేపుతారు. ఈ సమయంలోనే స్వప్న తను కడుపుతో ఉందన్న సంగతి మర్చి పోయి తెగ డ్యాన్స్ చేస్తుంది. అయితే అప్పుడే తన కడుపుకు పెట్టుకున్న ప్యాడ్ పడిపోతుంది. అది చూసిన కావ్య.. వెంటనే స్వప్నని అక్కడి నుంచి లాక్కెళ్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా దాస్తావ్ అక్కా.. నిజం చెప్పేయ్ అంటుంది. వినిపించుకోని పొగరుబోతు స్వప్న.. నేనేమీ చిన్న పిల్లని కాదు.. నేను ఏం చేస్తున్నానో అన్నీ తెలిసే చేస్తున్నా.. నువ్వు నాకు సలహాలు ఇవ్వడం మానేసి.. ఇలాంటి తప్పు జరిగినప్పుడు వచ్చి సహాయం చేయి చాలు అని నోరు పారేసుకుంటుంది.

నా మోసంలో నువ్వు కూడా భాగం అయ్యావ్.. మర్చిపోకు: స్వప్న

అంటే నువ్వు నీ మోసంలో భాగం అవ్వమంటున్నావా అని కావ్య అనగా.. ఇప్పుడేంటి నువ్వు ఎప్పుడో నా మోసంలో భాగం అయ్యావ్.. పెళ్లి రోజే నిజం తెలిసినా నువ్వు ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయం బయట పడితే నాతో పాటు నువ్వు కూడా దోషివే అవుతావ్ అని స్వప్న అంటుంది. అంటే ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని కావ్య అనగా.. నేను చేయాల్సిన అవసరం లేదు సరిగ్గా ఆలోచిస్తే నువ్వే వచ్చి ఇందులో ఇరుక్కున్నావ్.. నేను నీకు చేసింది ఏమీ లేదు అని స్వప్న అంటుంది. ఓ అవునా.. సరే అయితే నేను కూడా ఈ మోసంలో భాగం అంటున్నావ్ కాబట్టి.. నేను ఇంకా ఇందులో ఉండాలి అనుకోవడం లేదు.. అందరికీ ఇప్పుడే వెళ్లి నిజం చెప్పేస్తా.. అని కావ్య వెళ్లబోతే.. స్వప్న ఆపుతుంది. ఎందుకు ఆపుతున్నావ్.. నేను చేసిన మోసానికి భయ పడటం లేదు. ఏ శిక్ష వేసినా సరే అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని కావ్య అంటుంది. కానీ నేను సిద్ధంగా లేనని స్వప్న అంటుంది. అది నీ సమస్య అని కావ్య అంటుంది. అంటే నా కాపురం నాశనం అవడం నీ సమస్య కాదా.. ఇదేనా నువ్వు చెల్లిగా నా లైఫ్ గురించి ఆలోచించేది.

ఇవి కూడా చదవండి

అక్కా చెల్లెళ్ల హోరా హోరి.. నిజం చెప్పేస్తానన్న కావ్య:

నిద్ర లేచిన దగ్గర్నుంచి పడుకునే దాకా బంధాల గురించి, విలువల గురించి మాట్లాడతావ్ కదా మరి ఇదేనా నీ విలువలు అని స్వప్న అంటే.. ఓహో బెదిరిస్తే భయ పడటం లేదని ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా.. ఎంత కాలం అక్కా ఇలా.. ఎప్పుడు నువ్వు మారతావ్.. నిజంలో ఎప్పుడు బ్రతుకుతావ్. పెళ్లికి ముందు డబ్బున్న వాళ్లలా నటిస్తూ జనాన్ని మోసం చేశావ్.. పెళ్లిలో వెళ్లిపోయి కన్న వాళ్లను మోసం చేశావ్.. ఇప్పుడు కట్టుకున్న వాడిని, అత్తారింటిని కూడా మోసం చేస్తున్నావ్.. అక్కా త్వరలోనే ఈ ఇంటికి కొత్తగా మరో కోడలు రాబోతుంది తను వచ్చేక ఈ నిజం బయట పడితే.. నీకు విలువ ఉంటుందా.. దీని వల్ల ఇంట్లో పెద్ద గొడవలే జరుగుతాయ్.. అని కావ్య క్లాస్ తీసుకుంటుంది. అందుకే ఇప్పుడే చెప్పొద్దు అంటున్నా అని స్వప్న అంటే.. మరి ఎప్పుడు చెప్తావ్ అని కావ్య అడుగుతుంది. సమయం చూసి నేనే చెప్తాను.. నమ్మకు.. కానీ సమయం ఇవ్వు చాలు. త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం ఆలోచిస్తాను అని స్వప్న.. కావ్యని బ్రతిమాలుకుంటుంది.

కావ్యని బ్రతిమాలుకున్న స్వప్న.. కావ్యకు తెలిసిన రాజ్ నాటకం:

అంటే మళ్లీ కొత్త నాటకం ఆడ బోతున్నావా అని కావ్య అడుగుతుంది. కాదు పాత నాటకానికే తెర దించేస్తా అని అంటుంది స్వప్న. నమ్మమంటావా అని కావ్య అడిగితే.. సరే ఇదే నీకు చివరి అవకాశం. అమ్మానాన్నల పరువు తీయ్యకు అని కావ్య అంటుంది. ఇక స్వప్న కన్నింగ్ గా ఆలోచించి.. ఈ కడుపు పోతే.. మళ్లీ ఫ్రెష్ గా నేను లైఫ్ స్టార్ట్ చేయవచ్చు అని ఆలోచిస్తుంది. ఏదో ఒకటి చేసి.. అబార్షన్ అయినట్టు ఇంట్లో వాళ్లను నమ్మిస్తే.. సమస్యలు అన్నీ తీరిపోతాయ్ అని స్వప్న ప్లాన్ చేస్తుంది. ఇక ఆ తర్వాత అందరూ భోజనాల దగ్గర కూర్చుని.. సరదాగా సమయాన్ని గడుపుతూంటారు. ఇక ఈరోజుతో ఎపిసోడ్ ముగుస్తుంది.