AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG 2 OTT: సర్‌ప్రైజ్‌.. ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసిన అక్షయ్‌ ‘ఓ మై గాడ్‌ 2’.. ఎక్కడ చూడొచ్చంటే?

బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్‌ను నటించిన  సినిమా ఓ మై గాడ్‌ 2. లైంగిక విద్య ఆవశ్యకతపై తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఓ మోస్తరు హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే 'OMG 2' సెన్సార్ సమస్యను ఎదుర్కొంది. సినిమాలోని చాలా సన్నివేశాలు, డైలాగ్‌లకు సెన్సార్‌ బోర్డ్‌ కత్తెర వేసింది. మొత్తం 27 కట్స్ తో పాటు 25 మార్పులు సూచించారు. చివరకు ఈ సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చారు.

OMG 2 OTT: సర్‌ప్రైజ్‌.. ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసిన అక్షయ్‌ 'ఓ మై గాడ్‌ 2'.. ఎక్కడ చూడొచ్చంటే?
Oh My God 2 Movie
Basha Shek
|

Updated on: Oct 07, 2023 | 6:25 AM

Share

బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్‌ను నటించిన  సినిమా ఓ మై గాడ్‌ 2. లైంగిక విద్య ఆవశ్యకతపై తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఓ మోస్తరు హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ‘OMG 2’ సెన్సార్ సమస్యను ఎదుర్కొంది. సినిమాలోని చాలా సన్నివేశాలు, డైలాగ్‌లకు సెన్సార్‌ బోర్డ్‌ కత్తెర వేసింది. మొత్తం 27 కట్స్ తో పాటు 25 మార్పులు సూచించారు. చివరకు ఈ సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో అక్షయ్ కుమార్ సహా చిత్రబృందం సెన్సార్‌ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని అవాంతరాలు దాటి ఆగస్ట్‌ 11న థియేటర్లలో విడుదలైన ఓ మై గాడ్‌ 2 పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఓ మైగాడ్‌ 2 సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఆదివారం (అక్టోబర్‌ 8) నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఓటీటీ ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఒకరోజు ముందుగానే ఓమైగాడ్‌ సినిమాను డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా ఒక వీడియోను రిలీజ్‌ చేశారు హీరో అక్షయ్‌ కుమార్‌

‘OMG 2’ సినిమా OTT వెర్షన్‌పై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని వార్తలు వచ్చాయి. ఓటీటీలో కూడా సరిగ్గా 27 కట్స్‌తో సినిమా విడుదల అయ్యిందని తెలిసింది. ఓ మై గాడ్‌ 2 ఓటీటీ రిలీజ్‌పై అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘నాకు ఫైట్ చేయడం లేదా ఫైట్ చేయడం ఇష్టం లేదు. నాకు రూల్స్ గురించి తెలియదు, రూల్ బుక్ ఎప్పుడూ చదవను. ఇది అడల్ట్ సినిమా అని అనుకుంటే మనం ఏమీ చేయలేం. చాలా మందికి సినిమా చూపించాం, సినిమా అందరికీ నచ్చుతుంది. యువత కోసం ఈ సినిమా చేశాం. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. కాగా లైంగిక విద్య ఆవశ్యకతను వివరిస్తూ ‘OMG 2’ ను తెరకెక్కించారు డైరెక్టర్ అమిత్‌ రామ్. అక్షయ్‌ శివుడి దూతగా కనిపించగా, ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి శివ భక్తుడి పాత్రలో కనిపించారు. యామీ గుప్తా, పంకజ్ మల్హోత్రా తదితరులు ఈ చిత్రంలో నటించారు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి