అలర్ట్.. దిండు కవర్లు పిండటం లేదా? ఇది తెలియకపోతే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే..!
Pillow Covers: ప్రజలు తమ ఇళ్లను, ఇంటి బయటి ప్రాంతాన్ని నిత్యం శుభ్రం చేసుకుంటుంటారు. పడక గదులు సహా.. ప్రతి గదిని రోజూ క్లీన్ చేస్తారు. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితానికి ఇది చాలా ముఖ్యం. పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటారని, అన్ని విషయాల్లోనూ పరిశుభ్రత పాటించాలని నిపుణులు చెబుతుంటారు. చాలా మంది తమ ఇంట్లో..
Pillow Covers: ప్రజలు తమ ఇళ్లను, ఇంటి బయటి ప్రాంతాన్ని నిత్యం శుభ్రం చేసుకుంటుంటారు. పడక గదులు సహా.. ప్రతి గదిని రోజూ క్లీన్ చేస్తారు. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితానికి ఇది చాలా ముఖ్యం. పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటారని, అన్ని విషయాల్లోనూ పరిశుభ్రత పాటించాలని నిపుణులు చెబుతుంటారు. చాలా మంది తమ ఇంట్లో గదులును శుభ్రంగా చేయడంతో పాటు.. అందంగా అలంకరించుకుంటారు. అయితే, గదులు ఎంత ఆకర్షణీయంగా.. పడకగదులను శుభ్రంగా చేయడంతో పాటు.. అన్నింటికంటే ముఖ్యంగా క్లీన్ చేయాల్సిన అంశం మరోటి ఉంది. అదే మనం నిత్యం వినియోగించే పిల్లో కేసులు, బెడ్‌షీట్స్. అవును, అన్నీ శుభ్రంగా ఉంచినా.. అవి క్లీన్ చేయకపోతే.. చాలా పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెడ్‌షీట్లను వారానికి ఒకటి లేదా రెండుసార్లు తప్పనిసరిగా వాష్ చేయాలి. అలాగే.. ప్రతి వారం పిల్లోకేస్‌ని కూడా ఉతకాలని సూచిస్తున్నారు నిపుణులు. పిల్లకేసులను రోజూ తలగడగా ఉపయోగిస్తారు. తల.. ఆ తలగడపై పెట్టి నిద్రిస్తాం. తద్వారా.. దానిపై మురికి పేరుకుపోతుంది. ఒకవేళ దీనిని క్లీన్ చేయకపోతే.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చర్మ సమస్యలు, శ్వాసకోస సమస్యలు తలెత్తుతాయి. అందుకే.. పిల్లోకేసులు తప్పనిసరిగా కడగాలని సూచిస్తున్నారు నిపుణులు.
రోజూ వినియోగించడం వలన పిల్లోకేసులకు చెమట, నూనెలు, ఇతర మురికి అంటుకుంటుంది. తద్వారా వాటిని వాష్ చేయకుండా.. నిత్యం వాటినే ఉపయోగిస్తే చర్మం సంబంధిత, శ్వాస సంబంధిత అలెర్జీలకు కారణం అవుతుంది. నిపుణుల ప్రకారం.. ప్రతి మూడు, నాలుగు రోజులకు ఒకసారి పిల్లోకేసులను శుభ్రం చేసుకోవాలి. దిండు కవర్ల నుంచి అలెర్జీ కారకాలలు, దుమ్ము, దూళిని తొలగించడానికి తేలికపాటి డిటర్జెంట్, రెండు మూడు చుక్కల యూకలిప్టస్ నూనెను ఉపయోగించాలి. వైట్ వెనిగర్‌ను కూడా ఉపయోగించి క్లీన్ చేయొచ్చు. వేడి నీటిలో లాండ్రీ డిటర్జెంట్, స్టెయిన్ రిమూవర్‌ను కలిపి దిండు కవర్‌లను నానబెట్టాలి. ఇలా శుభ్రం చేస్తే.. పిల్లో కవర్ త్వరగా శుభ్రమవుతుంది. నివేదికల ప్రకారం.. నాలుగు వారాలు శుభ్రం చేయకుండా ఉన్న పిల్లోకేస్‌లో 12 మిలియన్ల సూక్ష్మజీవులు ఉంటాయట. వారం రోజుల ఉతకకుండా ఉన్న పిల్లోకేసులో 50 లక్షల బ్యాక్టీరి ఉంటుందట. ఈ పిల్లోకేసులను ఉతకకపోవడం అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..