AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gossip: ఎదుటి వ్యక్తి మీ గురించి గాసిప్స్ చెబుతున్నారా? ఈ 3 సంకేతాలతో తెలుసుకోండి..

Gossip vs Venting: గాసిప్.. గాసిప్.. గాసిప్.. ఒక్క మాటలో చెప్పాలంటే.. అన్నపానియాలు లేకున్నా మనిషి బ్రతకగలడేమో కానీ.. గాసిప్ లేకుండా, గాసిప్ చెప్పకుండా.. గాసిప్ వినకుండా ఉండలేని పరిస్థితి ఉంది. అవును, ప్రతిచోటా ఉంటుంది. చాలా మంది గాసిప్ చేయడానికి ఇష్టపడతారు. అది స్నేహితుల మధ్య గాసిప్ అయినా,

Gossip: ఎదుటి వ్యక్తి మీ గురించి గాసిప్స్ చెబుతున్నారా? ఈ 3 సంకేతాలతో తెలుసుకోండి..
Gossip
Shiva Prajapati
|

Updated on: Oct 09, 2023 | 10:13 PM

Share

Gossip vs Venting: గాసిప్.. గాసిప్.. గాసిప్.. ఒక్క మాటలో చెప్పాలంటే.. అన్నపానియాలు లేకున్నా మనిషి బ్రతకగలడేమో కానీ.. గాసిప్ లేకుండా, గాసిప్ చెప్పకుండా.. గాసిప్ వినకుండా ఉండలేని పరిస్థితి ఉంది. అవును, ప్రతిచోటా ఉంటుంది. చాలా మంది గాసిప్ చేయడానికి ఇష్టపడతారు. అది స్నేహితుల మధ్య గాసిప్ అయినా, ఇరుగుపొరుగు వారి మధ్య గాసిప్ అయినా.. బెస్ట్ ఫ్రెండ్స్ తో గాసిప్ అయినా.. గాసిప్‌లను నివారించడం దాదాపు అసాధ్యం. చాలా సార్లు, కోపంతో, వ్యక్తులు ఇతరుల గురించి తప్పుగా గాసిప్ చేయడం ప్రారంభిస్తారు, ఇది మీ సంబంధాలకు హాని కలిగిస్తుంది.

రిలేషన్‌షిప్ థెరపిస్ట్ నైలా వారెన్ ప్రకారం.. గాసిప్‌లో, ఒకరి గురించి అతిశయోక్తిగా, ఆసక్తికరంగా లేదా తప్పుగా సూచించడం జరుగుతుంది. చాలా సార్లు ప్రజలు పుకార్లు వ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రచారం చేస్తుంటారు. ఇప్పటికే ఉన్న గాసిప్‌లో చేరతారు. కానీ కొన్నిసార్లు ఈ గాసిప్ కారణంగా బాధిత వ్యక్తి తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భావోద్వేగాలను వ్యక్తపరచడం, కోపాన్ని బయటపెట్టడం వలన ఇబ్బంది లేదు కానీ.. ఇతరులపై పుకార్లు సృష్టిస్తే మాత్రం వారికి చాలా హానీ చేసిన వారు అవుతారు. అంతేకాదు.. దీని ద్వారా మీ ప్రతిష్ట కూడా దెబ్బతింటుంటా. కోపాన్ని వెళ్లగక్కడం, పుకార్లు సృష్టించడానికి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వ్యక్తిగత విషయాలతో పేర్లను పంచుకోవడం గాసిప్.

ఎవరైనా ఏదైనా స్పైసీగా చెబితే అందరూ వినేందుకు ఆసక్తి చూపుతారు. అవకాశం వచ్చినప్పుడు మూడో వ్యక్తికి కూడా చెప్పవచ్చు. వాస్తవానికి, ఎవరైనా వ్యక్తి మరొకరి విషయాలను మూడవ వ్యక్తికి చెప్పడాన్ని దాని గాసిప్ అంటారు. అయితే, ఈ గాసిప్ చెప్పేటప్పుడు వ్యక్తి పేరు, వారి గుర్తింపు గురించి చెప్పడకుండా నియంత్రించుకుంటే మంచిది. ద్వారా మీ వ్యక్తిత్వం కూడా దెబ్బతినకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇలా చెబితే కోపాన్ని వెళ్లగక్కడమే అవుతుంది..

మీరు ఎవరితోనైనా పంచుకోవాలనుకునే అనేక విషయాలు మీలోనే ఉన్నట్లయితే.. కాలక్రమేణా మీరు ఎవరికీ చెప్పకపోతే.. అది మీలో కోపానికి దారి తీస్తుంది. ఈ పరిస్థితిలో మీరు మీకు జరిగిన విషయాలను ఎవరికైనా చెబితే.. దానిని మీ కోపాన్ని వెళ్లగక్కడం అంటారు. ఉదాహరణకు, మీరు ఎవరితోనైనా గొడవ పడి, మీ గతం గురించి మీ స్నేహితుడికి చెప్పండి. అప్పుడు మీ భావాలు కోపంగా లేదా విచారంగా ఉండవచ్చు. మీరు ఈ కష్టాన్ని మీకు దగ్గరగా ఉన్న వారితో చెప్పినప్పుడు, అతను మీ కోపాన్ని అర్థం చేసుకుంటాడు. సరైన సలహా కూడా ఇస్తాడు.

వేరొకరి అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నించడం కూడా గాసిప్.

ఒక వ్యక్తి అవతలి వ్యక్తి వ్యక్తిత్వాన్ని మార్చి చెప్పడానికి ప్రయత్నిస్తే.. మీకు గాసిప్ చెబుతున్నారని అర్థం. ఏదైనా సమస్య లేదా వ్యక్తి గురించి మీ స్నేహితుడు మీ కంటే భిన్నమైన అభిప్రాయాన్ని చెప్పారని మనం అనుకుందాం. ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోకుండా, మీ స్నేహితుడు చెప్పేది మార్చడానికి లేదా మీ వైపు అంగీకరించమని అతనిని ఒప్పించడానికి ప్రయత్నిస్తే, దానిని గాసిప్ అని పిలుస్తారు.

మరిన్ని హ్యయన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..