- Telugu News Photo Gallery Health Tips: Using your phone too much can lead to 'trigger finger', be aware of this problem
Smartphone Trigger Finger: మీరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? త్వరలో మీకూ ట్రిగ్గర్ ఫింగర్ సమస్య ..
డిజిటలైజేషన్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్స్, టచ్ స్క్రీన్‌లు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించని వారు నేటి కాలంలో ఉండరనడం అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరి చేతిలో టచ్ స్క్రీన్ ఫోన్లు కనిపిస్తున్నాయి. చాలామటుకు యువత స్మార్ట్‌ఫోన్‌కు బానిసలుగా మారిపోయారు. ఈ వ్యసనం వల్ల ట్రిగ్గర్ ఫింగర్ అనే ఆరోగ్య సమస్య వస్తుంది. పదే పదే వేళ్లను మొబైల్ స్క్రీన్‌పై ఉంచి బ్రౌజింగ్ చేయడం వల్ల వేళ్ల నొప్పులు, చేతి నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ప్రపంచ..
Updated on: Oct 06, 2023 | 7:57 PM

డిజిటలైజేషన్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్స్, టచ్ స్క్రీన్‌లు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించని వారు నేటి కాలంలో ఉండరనడం అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరి చేతిలో టచ్ స్క్రీన్ ఫోన్లు కనిపిస్తున్నాయి. చాలామటుకు యువత స్మార్ట్‌ఫోన్‌కు బానిసలుగా మారిపోయారు. ఈ వ్యసనం వల్ల ట్రిగ్గర్ ఫింగర్ అనే ఆరోగ్య సమస్య వస్తుంది.

పదే పదే వేళ్లను మొబైల్ స్క్రీన్‌పై ఉంచి బ్రౌజింగ్ చేయడం వల్ల వేళ్ల నొప్పులు, చేతి నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 2 శాతం మంది ఈ ట్రిగ్గర్ ఫింగర్ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు అంటున్నారు.ట్రిగ్గర్ ఫింగర్ అనేది ఓ రకమైన కండరాల సమస్య. ఇది సాధారణంగా బొటనవేలు వంగడం, నిఠారుగా ఉండలేక పోవడం, కదలికల సమయంలో లాక్ చేయడానికి లేదా వెనుకకు పట్టుకోలేకపోవడం వంటి సమస్యలకు కారణం అవుతుంది.

ఈ సమస్య వస్తే బొటనవేలు లేది ఇతర వేళ్లను సులభంగా కదపలేరు. ట్రిగ్గర్ ఫింగర్ సమస్య తీవ్రత మీరు ఎంత సమయం పాటు టచ్‌స్క్రీన్‌ను ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

వేలులో వాపు లేదా నొప్పి, వేలు దృఢంలేకపోవడం వంటి ఈ ట్రిగ్గర్ ఫింగర్ ముఖ్య లక్షణం. టచ్‌స్క్రీన్‌లపై నిరంతరం నొక్కడం, స్క్రోలింగ్ చేయడం వల్ల వేళ్ల స్నాయువులపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది వాపుకు దారితీస్తుంది.

ఇది ట్రిగ్గర్ ఫింగర్ సమస్యకు కారణం అవుతుంది.ఈ ట్రిగ్గర్ ఫింగర్ సమస్య పురుషుల కంటే మహిళల్లో 6 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ట్రిగ్గర్ వేలు సమస్య తలెత్తినప్పుడు ఫిజియోథెరపిస్ట్‌లను సంప్రదించాలి. ఫిజియోథెరపిస్టులు సూచించే ఫింగర్ వ్యాయామాలు సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.





























