- Telugu News Photo Gallery Health Benefits Of Tamarind From Controlling Cholesterol To Promoting Digestion In Body
Tamarind: మనకు తెలియకుండా వంటల్లో వాడే ఈ పదార్ధం ఎన్ని రోగాలకు దివౌషధమో తెలుసా..
చాలా మంది పట్టించుకోని విలువైన ఆహారాల్లో చింతపండు ఒకటి. సాధారణంగా చింతపండు వంటల్లో రుచిని అందించడానికి వినియోగిస్తుటాం. అయితే చింతపండులో ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు కూడా ఉన్నాయి. చింతపండు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. చింతపండులో ముఖ్యంగా విటమిన్ సి, ఫ్లేవనాయిడ్, కెరోటిన్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, బలోపేతం చేయడానికి ఇది సహాయపడుతుంది...
Updated on: Oct 06, 2023 | 6:52 PM

చాలా మంది పట్టించుకోని విలువైన ఆహారాల్లో చింతపండు ఒకటి. సాధారణంగా చింతపండు వంటల్లో రుచిని అందించడానికి వినియోగిస్తుటాం. అయితే చింతపండులో ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు కూడా ఉన్నాయి. చింతపండు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. చింతపండులో ముఖ్యంగా విటమిన్ సి, ఫ్లేవనాయిడ్, కెరోటిన్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, బలోపేతం చేయడానికి ఇది సహాయపడుతుంది.

చింతపండులో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇందులో ఫ్లేవనాయిడ్స్ వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, క్లెన్సింగ్ గుణాలు కలిగిన చింతపండును డిష్ వాష్ లిక్విడ్‌లో కూడా ఉపయోగిస్తారు.

చట్నీల నుంచి సాంబారు వరకు చింతపండు భోజనానికి రుచిని అందిస్తుంది. తద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కడుపులోని పురుగులను బయటకు పంపే శక్తి చింతపండుకు ఉంది. ఇది యాంటీవైరల్ ఏజెంట్, యాంటీ ఫంగల్ పనిచేస్తుంది. అలాగే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి.

చింతపండులోని గుణాలు గాయం నయం చేయడంలో సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకాన్ని నయం చేస్తుంది. చింతపండు కఫాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చింతపండు బ్లడ్ టానిక్‌గా పనిచేస్తుంది. శరీరంలో ఎక్కువ రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి చింతపండు ఉపయోగపడుతుంది.

చింతపండు తింటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. చింతపండులోని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు క్యాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులను నియంత్రిస్తుంది. చింతపండు తినడం వల్ల ఐరన్ లోపం వల్ల సంభవించే అనీమియాను నివారించవచ్చు.





























