Viral: హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న రష్యన్ పౌరులు.. వీడియో వైరల్.
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని అఖండ్ పరమానంద్ ఆశ్రమంలో రష్యాకు చెందిన మూడు జంటలు హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతగానో నచ్చి.. హిందు ఆచారంలో పెళ్లి చేసుకున్నట్లు వారు చెప్పారు. వీరి వివాహానికి.. మరికొంత మంది రష్యా పౌరులు కూడా హాజరయ్యారు.. 50 మంది రష్యా పౌరులు ఆధ్యాత్మిక యాత్ర కోసం భారత్ కు వచ్చారు.
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని అఖండ్ పరమానంద్ ఆశ్రమంలో రష్యాకు చెందిన మూడు జంటలు హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతగానో నచ్చి.. హిందు ఆచారంలో పెళ్లి చేసుకున్నట్లు వారు చెప్పారు. వీరి వివాహానికి.. మరికొంత మంది రష్యా పౌరులు కూడా హాజరయ్యారు. 50 మంది రష్యా పౌరులు ఆధ్యాత్మిక యాత్ర కోసం భారత్ కు వచ్చారు. యాత్రలో భాగంగా వారు ఉత్తరాఖండ్ హరిద్వార్ చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి భారత ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు బాగా నచ్చాయి. రష్యా పౌరుల బృందంలోని 3 జంటలు అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. దీంతో అక్టోబరు 4న పరమానంద్ ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తంతుకు ముందు ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ పెళ్లిలో వధూవరులు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించారు. వరులు షేర్వానీ ధరించగా.. వధువులు లెహంగాల్లో ఆకట్టుకున్నారు. అంతేకాదు, ఉత్తరాఖండ్ ఫేమస్ డ్రమ్స్, సంప్రదాయ వాద్యాలకు, హిందీ పాటలకు హుషారుగా డ్యాన్స్‌లు చేస్తూ.. కరెన్సీ నోట్లను వెదజల్లుతు ఎంజాయ్ చేశారు. తర్వాత ఆశ్రమంలో ఉన్న శివాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం ఆశ్రమం గురూజీ పరామనంద్ గిరి మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత ఒకరికొకరు పూల దండలు మార్చుకొని.. వేదమంత్రాల మధ్య మండపంలో పెళ్లి ప్రమాణాలు చేసి, ఏడు అడుగులు నడిచారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..