Gurmeet Choudhary: సీపీఆర్‌తో ఒకరికి ఉపిరి పోసిన రియల్‌ హీరో గుర్మీత్‌ చౌదరి..  వీడియో వైరల్.

Gurmeet Choudhary: సీపీఆర్‌తో ఒకరికి ఉపిరి పోసిన రియల్‌ హీరో గుర్మీత్‌ చౌదరి.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Oct 08, 2023 | 8:08 PM

ప్రముఖ సినీ నటుడు, టెలివిజన్‌ యాక్టర్‌ గుర్మీత్‌ చౌదరి మంచి మనసు చాటుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి సీపీఆర్‌ అందించి అతడిని ఆసుపత్రికి తరలించేందుకు సాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.ముంబైలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అపస్మారకస్థితికి చేరిన అతన్ని స్థానికులు పైకి లేపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడున్న గుర్మీత్‌...

ప్రముఖ సినీ నటుడు, టెలివిజన్‌ యాక్టర్‌ గుర్మీత్‌ చౌదరి మంచి మనసు చాటుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి సీపీఆర్‌ అందించి అతడిని ఆసుపత్రికి తరలించేందుకు సాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ముంబైలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అపస్మారకస్థితికి చేరిన అతన్ని స్థానికులు పైకి లేపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడున్న గుర్మీత్‌… బాధితుడిని కాపాడే ప్రయత్నం చేశాడు. కొన ఉపిరితో ఉన్న అతడికి సీపీఆర్‌ అందించి ప్రాణాలు కాపాడారు. వెంటనే సదరు వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు సాయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు గుర్మీత్‌ను మెచ్చుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించిన గుర్మీత్‌ను రియల్‌ హీరో అంటూ కొనియాడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..