Sikkim: సిక్కిం విపత్తును 2021లోనే ఊహించారా.? డ్యామ్ కొట్టుకుపోవడానికి కారణాలేమిటి.?
తీస్తా నది పరీవాహక ప్రాంతంలో ఆకస్మిక వరదలతో సిక్కిం విలవిలలాడుతోంది. వరదలతో ఇప్పటికే 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 98 మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. వీరిలో 22 మంది భారత సైనికులు కూడా ఉన్నారు. తీస్తా నది ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున వీరి ఆచూకీ కోసం దిగువ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. నాసిరకం నిర్మాణం కారణంగా చుంగుతాంగ్ డ్యామ్ కొట్టుకుపోయిందని ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు.
తీస్తా నది పరీవాహక ప్రాంతంలో ఆకస్మిక వరదలతో సిక్కిం విలవిలలాడుతోంది. వరదలతో ఇప్పటికే 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 98 మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. వీరిలో 22 మంది భారత సైనికులు కూడా ఉన్నారు. తీస్తా నది ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున వీరి ఆచూకీ కోసం దిగువ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. నాసిరకం నిర్మాణం కారణంగా చుంగుతాంగ్ డ్యామ్ కొట్టుకుపోయిందని ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు. సిక్కిం వరదలపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్.. హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం వరద నష్టాలను జాతీయ విపత్తులుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నాసి రకం నిర్మాణం కారణంగా సిక్కింలోని చుంగుతాంగ్ డ్యామ్ కొట్టుకుపోయిందని స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి తోడు బుధవారం ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో లోనాక్ సరస్సులో నీటిమట్టం భారీగా పెరిగిపోయింది. దీంతో వరద మొత్తం చుంగుతాంగ్ డ్యామ్ వైపు మళ్లింది. ఈ కారణంగా డ్యామ్ తెగి దిగువ ప్రాంతాలపైకి వరద పోటెత్తింది.
రాష్ట్రం ఉత్తరభాగంతో మిగిలిన ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ వరదల్లో ఎన్‌హెచ్-10 జాతీయ రహదారి పలు ప్రాంతాల్లో దారుణంగా దెబ్బతింది. మొత్తం 4 జిల్లాల్లో వరదల ప్రభావం ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం 26 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. వరద నష్టాలు ఎక్కువగా ఉన్న సింగ్తమ్ ప్రాంతాన్ని సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు సైజు గత 30 ఏళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1990లో ఇది 0.42 చదరపు కిలోమీటర్లు ఉండేది. 2019 నాటికి ఇది 1.35 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దీనిలో 6.5 కోట్ల క్యూబిక్ అడుగుల నీరు నిల్వ ఉంది. ఇది ఎప్పుడైనా పెను వరదలకు కారణం అవుతుందని.. బెంగళూరు ఐఐఎంకు చెందిన ఓ రీసెర్చర్ 2021లో హెచ్చరించారు. తాజాగా చుంగుతాంగ్ డ్యామ్‌కు గండి పడిన సమయంలో లోనాక్ సరస్సు లో ఉన్న నీరంతా డ్యామ్‌లోకి చేరలేదు. ఈ సరస్సులో ఇంకా నీరు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. ఈ నీరు కూడా డ్యామ్‌లోకి చేరితే పెనువిపత్తు చోటు చేసుకునేదని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..