Ancient idols: తమిళనాడులో కోట్ల విలువైన విగ్రహాలు లభ్యం.. విలువెంతో తెలిస్తే షాకే..!

Ancient idols: తమిళనాడులో కోట్ల విలువైన విగ్రహాలు లభ్యం.. విలువెంతో తెలిస్తే షాకే..!

Anil kumar poka

|

Updated on: Oct 08, 2023 | 6:06 PM

తమిళనాడులో కోట్ల విలువ చేసే పురాతన పంచలోహ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విరుదునగర్‌ జిల్లా కారియాప్పట్టికి చెందిన బాలమురుగన్‌, పురాతన మాణిక్క వినాయగర్‌, మాణిక్కవాసగర్‌ విగ్రహాలను అక్రమంగా విక్రయించడానికి యత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో విగ్రహాలను తాము కొనుగోలు చేస్తామని, వాటిని చెన్నైకి తీసుకురమ్మని పోలీసులు చెప్పారు.

తమిళనాడులో కోట్ల విలువ చేసే పురాతన పంచలోహ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విరుదునగర్‌ జిల్లా కారియాప్పట్టికి చెందిన బాలమురుగన్‌, పురాతన మాణిక్క వినాయగర్‌, మాణిక్కవాసగర్‌ విగ్రహాలను అక్రమంగా విక్రయించడానికి యత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో విగ్రహాలను తాము కొనుగోలు చేస్తామని, వాటిని చెన్నైకి తీసుకురమ్మని పోలీసులు చెప్పారు. దాంతో బాలమురుగన్‌ పోలీసులు చెప్పిన చోటికి తన అనుచరులతో కలిసి వెళ్లాడు.  విగ్రహాలు మఫ్టీలో ఉన్న పోలీసులకు ఇచ్చి, నగదు ఇవ్వమని అడిగారు. పోలీసులు వారు ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో విగ్రహాలను తిరువణ్ణామలై నుంచి చోరీ చేసినట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న రెండు విగ్రహాల విలువ 2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ విగ్రహాల వ్యవహారంతో సంబంధమున్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..