Betting Apps: ఒకరిది జ్యూస్‌ షాప్‌, మరొకరిది టైర్‌ షాప్‌.. బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల బ్యాక్‌గ్రౌండ్‌ ఇదీ.!

Betting Apps: ఒకరిది జ్యూస్‌ షాప్‌, మరొకరిది టైర్‌ షాప్‌.. బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల బ్యాక్‌గ్రౌండ్‌ ఇదీ.!

Anil kumar poka

|

Updated on: Oct 08, 2023 | 4:04 PM

మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా సమన్లు జారీ చేసింది. అయితే, ఈ యాప్‌ ప్రమోటర్లు ఎవరు? గతంలో వారు ఏం చేశారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. సౌరభ్‌ చంద్రకర్‌, రవి ఉప్పల్‌ ఈ బెట్టింగ్‌ యాప్‌ చీకటి సామ్రాజ్యంలో చక్రవర్తులుగా చలామణి అవుతుండగా.. వీరి నెట్‌వర్క్‌ విదేశాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం.

మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా సమన్లు జారీ చేసింది. అయితే, ఈ యాప్‌ ప్రమోటర్లు ఎవరు? గతంలో వారు ఏం చేశారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. సౌరభ్‌ చంద్రకర్‌, రవి ఉప్పల్‌ ఈ బెట్టింగ్‌ యాప్‌ చీకటి సామ్రాజ్యంలో చక్రవర్తులుగా చలామణి అవుతుండగా.. వీరి నెట్‌వర్క్‌ విదేశాల్లో కొనసాగుతున్నట్లు సమాచారం. నిందితుల్ని పట్టుకునేందుకు ఈడీ నాన్‌ బెయిలబుల్ వారెంట్లు, లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసింది. సౌరభ్‌ చంద్రకర్‌, రవి ఉప్పల్‌లు ఇద్దరూ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం భిలాయ్‌కు చెందినవారు. కొన్నేళ్ల కిందట సౌరభ్ నెహ్రూనగర్‌లో ఓ జ్యూస్‌ షాప్‌ నిర్వహించగా.. రవికి ఓ టైర్‌ షాప్‌ ఉన్నట్లు తెలిసింది. గ్యాంబ్లింగ్‌కు బానిసలైన ఈ ఇద్దరూ దుబాయ్‌ వెళ్లి ఓ షేక్‌, మరో పాకిస్థాన్‌ దేశీయుడితో స్నేహం చేశారు. వారి సాయంతో మహాదేవ్ బెట్టింగ్‌ యాప్‌ను ప్రారంభించారు. భారత్‌లో వీరి తరఫున వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి 4వేల మంది ప్యానెల్‌ ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు సుమారు 200 మంది కస్టమర్లున్నారు. ఆ లెక్కన రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతోంది. దాంతో కొద్దికాలంలోనే వీరు యూఏఈలో సైతం తమ చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించుకోగలిగారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో సౌరభ్‌ వివాహం జరిగింది. అందుకోసం దాదాపు రూ.200 కోట్లు ఖర్చుపెట్టాడు. వెడ్డింగ్‌ ప్లానర్లకు హవాలా మార్గంలో చెల్లించినట్లు అలాగే బాలీవుడ్‌ నుంచి 14 మంది సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరైనట్లు తెలిసింది. వారందరిపై ప్రస్తుతం ఈడీ నిఘా ఉంచింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..