Hyderabad: అర్థరాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి కారులో లాంగ్‌ డ్రైవ్‌.. మితిమీరిన వేగంతో నిండు ప్రాణాలు బలి!

హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన తుషార్‌ (18), కార్ఖానాకు చెందిన భవేష్‌రావు (17) అనే ఇద్దరు విద్యార్ధులు శామీర్‌పేట్‌లోని విశ్వవిశ్వాని కాలేజీలో బీబీఏ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నారు. అదే కాలేజీలో చదువుతోన్న వారి స్నేహితులు బొల్లారానికి చెందిన ఇంద్రకంటి హరిప్రియ, రూబెన్‌, ఫిలిప్‌ జాన్‌తో కలిసి బాలెనో కారులో శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లారు. దారి మధ్యలో కొంపల్లిలో మద్యం కొనుగోలు చేసిన వీరు కారులో తాగుతూ.. తూలుతూ జల్సాలు చేయసాగారు. ఇలా అవుటర్‌ సర్వీసు రోడ్డు మీదుగా శామీర్‌పేట్‌ నుంచి..

Hyderabad: అర్థరాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి కారులో లాంగ్‌ డ్రైవ్‌.. మితిమీరిన వేగంతో నిండు ప్రాణాలు బలి!
Keesara Road Accident
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 08, 2023 | 3:29 PM

కీసర, అక్టోబర్‌ 8: జల్సాలకు అలవాటు పడిన విద్యార్ధులు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా కారులో రాత్రి వేళ బయటకు వెళ్లారు. ఫూటుగా మద్యం సేవించి, మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఊహించని ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. కీసర సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన తుషార్‌ (18), కార్ఖానాకు చెందిన భవేష్‌రావు (17) అనే ఇద్దరు విద్యార్ధులు శామీర్‌పేట్‌లోని విశ్వవిశ్వాని కాలేజీలో బీబీఏ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నారు. అదే కాలేజీలో చదువుతోన్న వారి స్నేహితులు బొల్లారానికి చెందిన ఇంద్రకంటి హరిప్రియ, రూబెన్‌, ఫిలిప్‌ జాన్‌తో కలిసి బాలెనో కారులో శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లారు. దారి మధ్యలో కొంపల్లిలో మద్యం కొనుగోలు చేసిన వీరు కారులో తాగుతూ.. తూలుతూ జల్సాలు చేయసాగారు. ఇలా అవుటర్‌ సర్వీసు రోడ్డు మీదుగా శామీర్‌పేట్‌ నుంచి కీసర మండలం బోగారం సమీపంలోని హోలీమేరి కాలేజీ వరకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున కీసర సమీపంలో మూల మలుపు వచ్చిన తర్వాత ఒక్కసారిగా కారు అదుపు తప్పి చెట్టును వేగంగా ఢీ కొట్టారు. ఈ ఘటనలో తుషార్‌, భవేష్‌రావు అక్కడికక్కడే మృతి చెందారు. హరిప్రియ, రూబెన్‌, డ్రైవింగ్‌ చేస్తున్న ఫిలిప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వీరిని తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.

ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతున్న ఫిలిప్‌ జాన్‌ మద్యం సేవించలేదు. కానీ కారులో ఉన్న మిగిలిన వారు మద్యం తాగుతూ సెల్ఫీలు దిగుతూ జల్సా చేస్తుండగా కారు అదుపు తప్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన తుషార్‌ తండ్రి చెన్నైలో పని చేస్తున్నారు. నగరంలోని అల్వాల్‌ హిల్స్‌ కాలనీలో తల్లి, సోదరుడితో కలిసి ఉంటూ కాలేజీలో చదువుకుంటోంది. మృతుడు భవేష్‌రావు తన తల్లిదండ్రులు సోదరుడితో కలిసి అల్వాల్‌ కార్ఖానలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భవేష్‌రావ్‌ తండ్రి ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.