TSRTC New Chairman: తెలంగాణ ఆర్టీసీ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన MLA ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కొత్త ఛైర్మన్ గా జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారం (అక్టోబర్‌ 8) ఆర్టీసీ బస్భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. త్వరలో ఎన్నికల కోడ్ రాబోతున్న నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్థన్‌ రెడ్డి కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయన తదనంతరం ఆ స్థానంలో ముత్తిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ చైర్మన్ గా ఈ..

TSRTC New Chairman: తెలంగాణ ఆర్టీసీ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన MLA ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
TSRTC New Chairman BRS MLA Muthireddy Yadagiri Reddy
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 08, 2023 | 6:18 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8: తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కొత్త ఛైర్మన్ గా జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారం (అక్టోబర్‌ 8) ఆర్టీసీ బస్భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. త్వరలో ఎన్నికల కోడ్ రాబోతున్న నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్థన్‌ రెడ్డి కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయన తదనంతరం ఆ స్థానంలో ముత్తిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ చైర్మన్ గా ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. తనను ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావుకి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ ఎదుకుదలకు తన సాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. సంస్థలో సభ్యుడిగా పనిచేస్తూ, సంస్థ ఆదాయం పెరిగేందుకు అన్ని విధాలా సహకరిస్తానని ముత్తిరెడ్డి అన్నారు. కాగా ఈ సారి జరగనునున్న తెలంగాణ ఎన్నికలకు ముత్తిరెడ్డికి బీఆర్‌ఎస్ టికెట్ కేటాయించకపోవడం గమనార్హం.

బాధ్యతల స్వీకరణ అనంతరం తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మాట్లాడుతూ.. అనుభవుజ్ఞులైన ఎండీ వీసీ సజ్జనర్ నేతృత్వంలో టీఎస్ఆర్టీసీ అన్ని విభాగాల్లో ముందుకు దూసుకుపోతోంది. తనపై నమ్మకంతో ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించిందందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. నా శక్తి మేరకు ఆర్టీసీ సంస్థ వృద్ధికి పాటుపతాను. సంస్థ ఉద్యోగుల్లో ఒకరిగా సమిష్టిగా పని చేసి, టీఎస్ఆర్టీసీని లాభాల బాటవైపుకు తీసుకెళ్తాను. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా తనను నియమించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ముత్తిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్ తోపాటు ఛైర్మన్ యాదగిరి రెడ్డి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

కాగా టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సీఎం కేసీఆర్ అక్టోబర్ 5న నియమించారు. తెలంగాణ రైతు సంక్షేమ సంఘాల సమితి ఛైర్మన్‌గా తాటి కొండ రాజయ్య నియమితులయ్యారు. రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ గా పదవీ కాలం పూర్తయిన సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్‌కి సంస్థ అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. బాజిరెడ్డి గోవర్దన్, వినోద దంపతులను ఘనంగా సత్కరించారు. అక్టోబర్ 3న హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో బాజిరెడ్డి గోవర్దన్ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని టీఎస్ఆర్టీసీ నిర్వహించింది. గత రెండేళ్లలో ఆర్టీసీ మెరుగైన ఫలితాలు సాధించిందని, ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా సర్కార్‌ గుర్తించడం, సంస్థలోని వేల కోట్ల నష్టాన్ని భర్తీ చేయడం వెనుక ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ సజ్జనార్ అవిరామంగా కృషి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!
ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా..ఆసస్ ల్యాప్‌టాప్ ఫీచర్లివే.!