టికెట్ విషయంలో ఆ ఎమ్మెల్యే ఎందుకు సైలెంట్ అయ్యాడబ్బా.. కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమై ఉంటుంది.?
ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ ఇంకా పెడింగ్ లోనే ఉంచారు. ఈ విషయం పై ఇప్పటివరకు అధిష్టానం ఎటు తేల్చకపోవడంతో నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల్లో ఇంకా టెన్షన్ పెరుగుతూనే ఉంది. నర్సాపూర్ నియోజవర్గ ఎమ్మెల్యే మదన్ రెడ్డి,మహిళ కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మరెడ్డి మధ్య టికెట్ విషయంలో...

మొన్నటి వరకు హడావుడి చేసిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు సైలెంట్ అయ్యాడని తెలుస్తోంది. టికెట్ విషయంలో తగ్గదేలే అని చెప్పిన ఆయన ఇప్పుడు కొంత మెత్తపడినట్తు వార్తలు వస్తున్నాయి. ప్రగతి భవన్ పిలుపు వచ్చినప్పటి నుంచి చాలా నిదానంగా ఉంటున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఇంతంకీ ఎవరా ఎమ్మెల్యే..? ఆ నిజయోకవర్గం ఏంటి.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ ఇంకా పెడింగ్ లోనే ఉంచారు. ఈ విషయం పై ఇప్పటివరకు అధిష్టానం ఎటు తేల్చకపోవడంతో నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల్లో ఇంకా టెన్షన్ పెరుగుతూనే ఉంది. నర్సాపూర్ నియోజవర్గ ఎమ్మెల్యే మదన్ రెడ్డి,మహిళ కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మరెడ్డి మధ్య టికెట్ విషయంలో తీవ్ర పోటీ ఉండడం వల్లే ఈ టికెట్ ను పెండింగ్ లో పెట్టింది అధిష్టానం. అయితే మొన్నటి వరకు ఎమ్మెల్యే వర్గం అసలు తగ్గకుండా తమ నేతకు టికెట్ ఇవ్వాల్సిందే అని నియోజకవర్గ వ్యాప్తంగా నానా హంగామా చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేతో స్టేట్ మెంట్ లు ఇప్పించడం.. మంత్రి హరీష్ రావు ఇంటి వద్దకు వెళ్లి బల ప్రదర్శన చేయడం లాంటివి చేసిన విషయం తెలిసిందే. వీళ్ళు ఇంతలా హంగామా చేస్తున్న సునీత లక్ష్మరెడ్డి మాత్రం చాలా సైలెంట్‌గా ఉన్నారు. తన అనుచరులను కూడా తొందర పడొద్దని సునీత చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఎన్ని కార్యక్రమాలు చేసిన కూడా అధిష్టానం నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఇక ఎమ్మెల్యే మదన్ రెడ్డి పార్టీ వీడుతాడు అని కాంగ్రెస్ లో జాయిన్ అవుతాడు అని జోరుగా ప్రచారం జరిగింది.
ఇది మొదటికి మోసం వచ్చేలా ఉందని గ్రహించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తాను పార్టీ మారడం లేదు.. బీఆర్ఎస్ లోనే ఉంటాను అని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే గత కొద్ది రోజులుగా మదన్ రెడ్డిఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చినప్పటి నుంచి సైలెంట్ అయ్యాడు. టికెట్ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని తన అనుచరులకు కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ప్రగతి భవన్ నుంచి ఏ ఆదేశాలు వచ్చాయి, అసలు తమ నాయకుడికి మళ్లీ టికెట్ ఇస్తారా.? లేదా.? అన్న దానిపై ఎమ్మెల్యే మదన్ రెడ్డి అనుచరులు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేకు ఎలాంటి భరోసా వచ్చిందన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..