Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranjigondu Memorial Tribal Museum: హైదరాబాద్‌లో రాంజీగోండు స్మారక ట్రైబల్ మ్యూజియం.. రేపు శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రులు

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆబిడ్స్ లో 0.75 ఎకరాల్లో రాంజీ గోండు స్మారక గిరిజన స్వాతంత్ర్య సమర యోధుల మ్యూజియంకు సోమవారం (అక్టోబర్‌ 9) కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటుగా మసబ్ ట్యాంకులో వందశాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.6.5కోట్లు నిర్మాణం పూర్తిచేసుకున్న గిరిజన పరిశోధనా సంస్థ ట్రైబల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్‌ను కూడా కేంద్రమంత్రులు ఇరువురూ కలిసి..

Ranjigondu Memorial Tribal Museum: హైదరాబాద్‌లో రాంజీగోండు స్మారక ట్రైబల్ మ్యూజియం.. రేపు శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రులు
Ranjigondu Memorial Tribal Museum
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Srilakshmi C

Updated on: Oct 08, 2023 | 7:27 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆబిడ్స్ లో 0.75 ఎకరాల్లో రాంజీ గోండు స్మారక గిరిజన స్వాతంత్ర్య సమర యోధుల మ్యూజియంకు సోమవారం (అక్టోబర్‌ 9) కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటుగా మసబ్ ట్యాంకులో వందశాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.6.5కోట్లు నిర్మాణం పూర్తిచేసుకున్న గిరిజన పరిశోధనా సంస్థ ట్రైబల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్‌ను కూడా కేంద్రమంత్రులు ఇరువురూ కలిసి ప్రారంభించనున్నారు. రూ.34 కోట్లతో నిర్మించనున్న గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం కోసం కేంద్ర ప్రభుత్వం 2019-20లోనే రూ.15 కోట్లు మంజూరు చేయడంతోపాటు దీనికి తెలంగాణ ప్రాంతానికి చెందిన గిరిజన స్వాతంత్ర్య పోరాటయోధుడు రాంజీగోండు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చిస్తోంది. ఈ మ్యూజియం ఎలా ఉండాలి, ఇందులో ఏయే అంశాలను పొందుపరచాలనే విషయంపై.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చింది.

మొత్తం మూడు అంతస్తులుగా ఉండే ఈ మ్యూజియంలో మొదటి అంతస్తులో నిర్మల్ ఘాట్లలో రాంజీ గోండు ఆధ్వర్యంలో జరిగిన పోరాట ఘట్టాలు, వెయ్యి ఉరుల మర్రి దృశ్యాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తోంది. నాటి పోరాట యోధులు వాడిన వస్తువులు ప్రదర్శనకు ఉంచుతారు. రెండో అంతస్తులో మన తెలంగాణ ప్రాంతానికి చెందిన గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్, బిర్సా ముండా, మన్యం గిరిజన పోరాటానికి సంబంధించిన ఘట్టాలను చూపించే ఏర్పాట్లుంటాయి. మూడో అంతస్తులో.. తెలంగాణ ప్రాంతంలో ఉండే అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలు కు సంబంధించిన కళలు, కళాకృతులు, ఆచార వ్యవహారాలను తెలిపే ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు, మాసబ్ ట్యాంక్‌లో 0.3 ఎకరాలు రూ.6.5 కోట్లతో నిర్మించే ట్రైబల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ద్వారా.. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన తెగల చరిత్ర, వారి సంస్కృతి, సంప్రదాయాలు, వారి సంరక్షణ గురించి ఈ కేంద్రం ద్వారా పరిశోధిస్తారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ కిషన్ రెడ్డి.. హైదరాబాద్ నగరంలో ఈ రెండు కేంద్రాల ఏర్పాటుకోసం కృషిచేస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు రీసర్చ్ కేంద్రం ప్రారంభం అవుతుండటం, మ్యూజియంకు శంకుస్థాపన జరగడంతో.. తెలంగాణ స్వాతంత్ర్యం కోసం గిరిజనులు చేసిన త్యాగాలకు సరైన గుర్తింపు లభించడంతోపాటుగా.. వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసేలా పరిశోధలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.