Transfer of AR Srinivas: తెలంగాణ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ బదిలీ వెనుక అసలు కారణం అదేనా..? పెద్ద స్కెచ్ ఉందిగా..
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఏసీబీ దాడుల వ్యవహారమే ఏఆర్ శ్రీనివాస్ బదిలీకి కారణంగా విశ్వసనీయంగా తెలుస్తోంది. బంజారాహిల్స్ సీఐ నరేందర్‌తో పాటుగా ఎస్సై నవీన్ రెడ్డి మరొక హోంగార్డ్.. ముగ్గురిని కూడా 24 గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు చివరకు 41 నోటీసులు ఇచ్చి పంపించారు. బంజారాహిల్స్‌లో ఉన్న ఒక పబ్ వ్యవహారంలో ఓనర్లను ఇబ్బంది పెట్టారన్న ఆరోపణల కింద సీఐ నరేందర్‌తో పాటుగా ఎస్సై నవీన్ రెడ్డిని దాదాపు 24 గంటల పాటు విచారించి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డు...

హైదరాబాద్, అక్టోబర్ 8: రాష్ట్రంలో మరొక ఐపీఎస్ బదిలీ తీవ్ర వివాదంగా మారింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ ఏఆర్ శ్రీనివాస్‌ను తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ చేయడంపై ప్రభుత్వంపై అనేక విమర్శలు వెలివెత్తుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? ఏఆర్ శ్రీనివాస్‌ను బదిలీ చేయడం, అదీ ఎన్నికల ముందు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం (అక్టోబర్ 8) ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అసలు AR శ్రీనివాస్ బదిలీ వెనకాల ఏం జరిగింది???
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఏసీబీ దాడుల వ్యవహారమే ఏఆర్ శ్రీనివాస్ బదిలీకి కారణంగా విశ్వసనీయంగా తెలుస్తోంది. బంజారాహిల్స్ సీఐ నరేందర్‌తో పాటుగా ఎస్సై నవీన్ రెడ్డి మరొక హోంగార్డ్.. ముగ్గురిని కూడా 24 గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు చివరకు 41 నోటీసులు ఇచ్చి పంపించారు. బంజారాహిల్స్‌లో ఉన్న ఒక పబ్ వ్యవహారంలో ఓనర్లను ఇబ్బంది పెట్టారన్న ఆరోపణల కింద సీఐ నరేందర్‌తో పాటుగా ఎస్సై నవీన్ రెడ్డిని దాదాపు 24 గంటల పాటు విచారించి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఆ తర్వాత 41 నోటీసు ఇచ్చి 9వ తేదీన విచారణకు రావాలని కోరారు. బంజారాహిల్స్ లో జరిగిన ఏసీబీ సోదాలే ఏఆర్ శ్రీనివాస్ బదిలీకి కారణంగా తెలుస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హైదరాబాదులో అత్యంత కీలకమైన కాస్ట్లీ పోలీస్ స్టేషన్‌గా పేరొందిన బంజారాహిల్స్ పీసీపై ఏసీబీ అధికారులు విచారణ జరపడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దాంతోనే ఈ కేసుని డైరెక్ట్ చేసిన ఏఆర్ శ్రీనివాస్‌ను బదిలీ చేసిందన్న విమర్శలు అయితే ప్రభుత్వం పై వస్తున్నాయి.
గతంలో సిట్ చీఫ్‌గా ఉన్నప్పుడూ బదిలీ
గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు వ్యవహారంలో కూడా సిట్ చీఫ్‌గా పని చేసిన ఏఆర్ శ్రీనివాస్, ఆ కేసులో దాదాపు 100 మందికి పైగా అరెస్ట్ చేశారు. ఈ కేసు కీలక దశలో ఉన్న సమయంలోనే అప్పటి సిట్ ఛీఫ్ గా ఉన్న ఏఆర్ శ్రీనివాస్‌ను ప్రభుత్వం బదిలీ చేసి ఏసీబీ జాయింట్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. పోస్టింగ్ ఇచ్చిన ఆరు నెలలకే మరొకసారి ఆయనను బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. ముక్కుసూటి మనిషిగా.. స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తిగా.. పేరుపొందిన ఏఆర్ శ్రీనివాస్‌ను ఆరునెల వ్యవధిలో రెండుసార్లు బదిలీ చేయడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అది అవినీతి నిరోధక శాఖలో పని చేస్తున్న శ్రీనివాస్ లాంటి వ్యక్తిని ఏసీబీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నాడని ఏకైక నెపంతో బదిలీ చేశారని ఐపీఎస్ సర్కిల్‌లో మాట్లాడుకుంటున్నారు. ఏదీఏమైనా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. షెడ్యూల్ మరొక 24 గంటల్లో వస్తుందన్న నేపథ్యంలో.. ఆదివారం ఐపీఎస్సీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.