WiFi Router: రాత్రిళ్లు వైఫై రూటర్ ఆఫ్ చేయడం లేదా? ఏం జరుగుతుందో తెలుసా..
రోనా మహమ్మారి వచ్చిన తర్వాత మన జీవన విధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కోవిడ్ 19 సమయంలో పిల్లలు స్కూళ్లకు వెళ్లకుండా ఇంటి నుండి ఆన్‌లైన్‌లో చదువుకోవడం ప్రారంభించారు. ఇక ఉద్యోగులు కూడా ఇంటి నుంచే ఆఫీస్ పనులు చక్కబెట్టడం నేర్చుకున్నారు. ఈ రెండు ప్రయోజనాలకు WiFi చాలా అవసరం. దీంతో ప్రతి ఒక్కరు తమ ఇంటికి ఇంటర్‌నెట్ కోసం WiFi కనెక్షన్ తీసుకుంటున్నారు. రూటర్ ఇంట్లో 24 గంటలనూ ఆన్‌లోనే ఉంటుంది. వై-ఫై రూటర్ ఇళ్లలో ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మీకు వేగవంతమైన..
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మన జీవన విధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కోవిడ్ 19 సమయంలో పిల్లలు స్కూళ్లకు వెళ్లకుండా ఇంటి నుండి ఆన్‌లైన్‌లో చదువుకోవడం ప్రారంభించారు. ఇక ఉద్యోగులు కూడా ఇంటి నుంచే ఆఫీస్ పనులు చక్కబెట్టడం నేర్చుకున్నారు. ఈ రెండు ప్రయోజనాలకు WiFi చాలా అవసరం. దీంతో ప్రతి ఒక్కరు తమ ఇంటికి ఇంటర్‌నెట్ కోసం WiFi కనెక్షన్ తీసుకుంటున్నారు. రూటర్ ఇంట్లో 24 గంటలనూ ఆన్‌లోనే ఉంటుంది. వై-ఫై రూటర్ ఇళ్లలో ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మీకు వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం లభించడం అనేది నాణేనికి ఓ వైపు మాత్రమే చూస్తున్నారు. మరో వైపు ప్రాణాంతకమైన జబ్బులు దీని వల్ల సంక్రమిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైఫై వల్ల ప్రయోజనాలు ఉన్నట్లే దాని ప్రతికూలతలు కూడా ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. Wi-Fi రూటర్ల వినియోగం వల్ల కలిగే ప్రతికూలతలు ఇవే..
వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించే ఈ పరికరం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందని అనేక నివేదికలు పేర్కొంటున్నాయి. నివేదికల నుంచి అందిన సమాచారం మేరకు Wi-Fi రూటర్ల నుంచి చాలా తక్కువ పరిమాణంలో రేడియేషన్ విడుదలవుతుంది. కొంత సమయం పాటు ఈ డివైస్‌తో టచ్‌లో ఉంటే ఎలాంటి హాని ఉండదు. కానీ 24 గంటలు ఇది ఇంట్లో ఆన్‌లో ఉండటం వల్ల ఆరోగ్యంపై దాని ప్రభావం కనిపిస్తుంది. ఫలితంగా పలు రకాలఈ వ్యాధులు చుట్టుముడతాయి. రూటర్ నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ వల్ల కేన్సర్ మాత్రమే కాకుండా గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే Wi-Fi ఇప్పుడు ప్రతి ఇంటిలో అవసరంగా మారింది. దీని కారణంగా దాన్ని తొలగించడం సాధ్యం కాదు. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వైఫై వల్ల సంభవించే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఈ వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి.. ముందుగా బెడ్‌రూమ్‌లో Wi-Fi రూటర్‌ని ఇన్‌స్టాల్ చేయకుండా చూసుకోవాలి. రెండవది, మీరు రాత్రి పడుకునే ముందు రూటర్‌ని తప్పని సరిగా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీని నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావం మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడకుండా నిరోధించవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ సంబంధిత వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.